ఏపీలో జగన్ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ ప్రతీకార చర్యల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎలాగైనా దెబ్బతీయాలనే ఒకే ఒక్క అజెండాతో వైసీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. చంద్రబాబు తన సుదీర్ఘ 45 ఏళ్లకు పైబడిన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ ఎదుర్కొని విధంగా, గత ఐదేళ్ల కాలంలో చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలను, ప్రత్యేకించి CIDని కేవలం ఒక పార్టీ రాజకీయ ఆయుధంగా మార్చుకుని ఆయనపై గుట్టలకొద్దీ కేసులు నమోదు చేశారు. అయితే, ప్రత్యర్థిని ఇరికించడమే లక్ష్యంగా సాగిన ఈ కేసులు.. చివరకు న్యాయస్థానాల ముందు ఒక్కొక్కటిగా పేకమేడల్లా కూలిపోతున్నాయి.
Also Read : తమిళనాడు కేబినెట్ భేటీలో సంచలన వ్యాఖ్యలు..!
చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అధికారిక ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలిస్తే ఈ కుట్రల తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. 2014 నాటి అఫిడవిట్‌లో కేవలం 3 సాధారణ కేసులు మాత్రమే ఉండగా, జగన్ ఐదేళ్ల పాలన ముగిసేసరికి ఆ సంఖ్య ఏకంగా 19కి చేరింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ ప్రాజెక్ట్, అసైన్డ్ భూముల వ్యవహారంతో పాటు అంగళ్లు, పుంగనూరు ఘటనల వరకు ప్రతీ చిన్న అంశాన్ని పెద్దదిగా చూపిస్తూ క్రిమినల్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఒక జాతీయ స్థాయి నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని లీగల్‌గా ఇరికించి సమాజంలో వారి పరువు ప్రతిష్టలను మంటగెలిపించేందుకు నాటి ప్రభుత్వం పన్నిన కుట్రలు ఇవన్నీ.
Also Read : గల్లా జయదేవ్ కు లోకేష్ క్షమాపణ.. అసలేం జరిగింది..?
కానీ, చివరకు నిజం గెలుస్తుందనే నానుడి మరోసారి రుజువైంది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టులు..జగన్ హయాంలో నమోదైన కేసులను ఒక్కొక్కటిగా కొట్టివేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి అసైన్డ్ భూముల బదిలీ CID కేసును కోర్టు పూర్తిగా కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఆ పిటిషన్‌లో ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లేవని, కేవలం రాజకీయ దురుద్దేశంతో, కక్షసాధింపు కోణంలోనే కేసు నమోదు చేశారని కోర్టు స్పష్టంగా నిర్ధారించింది. కేవలం ఈ ఒక్క కేసే కాకుండా, రాజధాని ల్యాండ్ పూలింగ్ కోసం సదుద్దేశంతో తీసుకున్న ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై నేరపూరిత ఉద్దేశాలను ఆపాదించడం చెల్లదని కోర్టు స్పష్టం చేయడం వైసీపీ కుట్రలను బట్టబయలు చేసింది.
Also Read : బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ఓ రేంజ్ లో..!
చంద్రబాబుపై ఉన్న మిగిలిన కేసుల్లో కూడా మెజారిటీ కేసులు తుది విచారణ దశల్లో నిలవలేక తేలిపోతున్నాయి. కొన్ని కేసులపై కోర్టులు స్టే ఇవ్వగా, మరికొన్ని చార్జ్‌షీట్ స్థాయిలోనే ఆధారాలు లేక వీగిపోతున్నాయి. చట్టాన్ని గౌరవించి, న్యాయవ్యవస్థపై నమ్మకంతో సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన చంద్రబాబుకు న్యాయస్థానాలు వరుసగా ఇస్తున్న క్లీన్ చిట్స్.. జగన్ ఐదేళ్ల పాటు ఆడిన మైండ్ గేమ్ కేవలం రాజకీయ కక్షసాధింపేనని నిరూపిస్తోంది.

