ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం రాకా. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ జోనర్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి సరికొత్త క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అబ్బురపరచనున్నారట. తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు కనీసం ద్విపాత్రాభినయం కూడా చేయని బన్నీ, ఒకేసారి నాలుగు పాత్రలు పోషించనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : చంద్రబాబుకు ఉన్న నీటి సోయి… రేవంత్‌కు రావాలి!
దర్శకుడు అట్లీ తన గత చిత్రాలైన మెర్సల్ లో విజయ్ తో మూడు పాత్రలు, జవాన్ లో షారుఖ్ ఖాన్ తో రెండు పాత్రలు చేయించి మెప్పించారు. అదే రూట్ లో రాకా కథలో భాగంగా తాత, తండ్రి, మరియు ఇద్దరు కొడుకుల పాత్రలను డిజైన్ చేశారట. నిజానికి మొదట తాత, తండ్రి పాత్రలకు వేరే సీనియర్ నటులను అనుకున్నప్పటికీ, ఆ క్యారెక్టర్లలోని వైవిధ్యం నచ్చడంతో అల్లు అర్జున్ తానే చేస్తానని ముందుకొచ్చారట. బన్నీపై చేసిన లుక్ టెస్ట్ చూసి అట్లీ సైతం ఫిదా అయిపోయి మరో మాట లేకుండా ఓకే చెప్పినట్లు సమాచారం.
Also Read : సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ ఖాయమా..?
గతంలో తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి లెజెండరీ నటులు మాత్రమే ఇలాంటి బహుపాత్రలు పోషించి మెప్పించారు. ఇప్పుడు రాకా సినిమాతో అల్లు అర్జున్ కూడా ఈ లీగ్ లోకి అడుగుపెడుతుండడం విశేషం. ఈ చిత్రంలో నాలుగు పాత్రలకు తగినట్లుగా భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉండబోతోంది. కేవలం బన్నీ పాత్రలే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇందులో ప్రధాన నాయికగా బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోణె నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో రశ్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, మరియు ఫెమినా జార్జ్ వంటి స్టార్ హీరోయిన్లు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతమంది అందాల భామలతో పాటు అల్లు అర్జున్ కనబర్చబోయే నాలుగు విభిన్న అవతారాలు రాకా సినిమాకు అతిపెద్ద అసెట్ గా మారనున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని క్రేజీ అప్డేట్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

