Tuesday, July 14, 2026 09:52 PM
Tuesday, July 14, 2026 09:52 PM

తెలంగాణా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం..!

గత ఆరేళ్లుగా తెలంగాణ రాజకీయ, అధికార వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం, ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ.బి. వెంకటేశ్వరరావును సుదీర్ఘంగా విచారించింది. ఈ కేసులో పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక అత్యున్నత స్థాయి మాజీ పోలీస్ అధికారిని సిట్ విచారించడం ఇదే తొలిసారి కావడంతో ఈ పరిణామం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : పవన్ క్రేజీ ఆలోచన.. ఏంటి ఈ సీడ్ బాల్స్..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అక్రమంగా నిర్వహించిన నిఘా వ్యవహారాలపై సిట్ విస్తృతంగా ఆధారాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించిన కొన్ని కీలక లింకులు బయటపడటంతో అధికారులు ఆయనకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచారు. అయితే, ఆయనను ఈ కేసులో నిందితుడిగా కాకుండా, ఒక సాక్షిగా పరిగణిస్తూ ఆయన స్టేట్‌మెంట్‌ ను సిట్ అధికారులు అధికారికంగా రికార్డు చేశారు. నాడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

Also Read : మళ్లీ బీఆర్ఎస్ వైపు ఈటల అడుగులు.. నిజమేనా..?

అలాగే కొంతకాలం పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగాలు ఆయన కదలికలపై, ఫోన్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు సిట్ దర్యాప్తులో ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఆయనను ప్రధానంగా మూడు అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నాటి తెలంగాణ అధికారుల నుంచి ఆయనకు ఎలాంటి నిఘా నీడ ఎదురైంది..? ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన కమ్యూనికేషన్లను తెలంగాణ ఎస్ఐబీ ఏ విధంగా ట్రాక్ చేసింది..? తన ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయనే విషయాన్ని ఆయన ఎప్పుడైనా గమనించారా..? దానివల్ల ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి..? ఈ ప్రశ్నలకు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు సిట్ అధికారులకు పలు కీలక వివరాలను అందజేసినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చంద్రబాబుకు ఉన్న నీటి...

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్...

ఆ ముగ్గురి చుట్టూ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్...

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

దూకుడు పెంచిన కవితక్క.....

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

పోల్స్