Tuesday, August 25, 2026 04:31 AM
Tuesday, August 25, 2026 04:31 AM

అంతా ఓపెన్.. రావణ్‌కు జగన్ మద్దతు..!

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా రావణ్ అలియాస్ జోసఫ్ ఉన్నాడు. తొలి నుంచి టీడీపీ, జనసేన పార్టీల అధినేతలే టార్గెట్‌‌గా ప్రశ్న అనే యూట్యూబ్ ద్వారా నోటికి వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నాడు రావణ్. బూతులతో రెచ్చిపోతూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. దీంతో రావణ్‌ను హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు సార్లు బెయిల్‌పై బయటకు వచ్చాడు కూడా. అయితే తన వీడియోల్లో దేశ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో పాటు హిందూ దేవుళ్లను కించపరిచేలా రావణ్ వ్యాఖ్యలు చేయడంపై పలు హిందూ ధార్మిక సంఘాలు ఫిర్యాదు చేయడంతో.. రావణ్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు.

Also Read : దూకుడు పెంచిన కవితక్క.. దబిడి దిబిడి..!

తొలి నుంచి రావణ్‌కు వైసీపీ మద్దతు ఉందనేది తెలుగుదేశం, జనసేన పార్టీ నేతల ఆరోపణ. అయితే రావణ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని.. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగానే తాము పోరాటం చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు కూడా. రావణ్ అరెస్టు తర్వాత దాదాపు ప్రతి రోజూ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని సహా.. ఆ పార్టీ నేతలంతా పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మరీ రావణ్ అమాయకుడు అని చెప్పే ప్రయత్నం చేశారు. పైకి మాత్రం అక్రమ అరెస్టులు అని చెబుతున్నప్పటికీ.. రావణ్‌ను పెంచిపోషిస్తోంది మాత్రం వైసీపీ అనేది టీడీపీ నేతల ఆరోపణ. రావణ్‌కు ప్రతి నెలా రూ.5 లక్షలు వైసీపీ చెల్లించిందని.. ఇది కేవలం టీడీపీని, జనసేనను తిట్టేందుకు మాత్రమే అని కూడా టీడీపీ నేతలు ఆరోపించారు.

Also Read : ముద్దు సన్నివేశాలపై సాయి పల్లవి ఘాటు కామెంట్స్

టీడీపీ నేతలు తాము చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఓ వీడియోను విడుదల చేశారు. ప్రతి మంగళవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆ తర్వాత తిరిగి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ కొలీగ్ గగన కలిశారు. గగన అక్కడ ఉన్నట్లుగా పక్కనే ఉన్న వైసీపీ నేతలు చెప్పడంతో.. ముందుకు వెళ్లిన జగన్.. మళ్లీ వెనక్కి వచ్చి.. గగనను పలకరించారు. మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జోసఫ్ అలియాస్ రావణ్‌ కేసు చూసుకోవాలని వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ దేవినేని అవినాష్‌కు ప్రత్యేకంగా సూచించారు. దీంతో రావణ్ వెనుక వైసీపీ నేతలున్నారనే టీడీపీ ఆరోపణలు నిజమే అని వీడియో ద్వారా రుజువైంది. మరి ఈ వీడియోపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్