ప్రస్తుతం టెలికాం రంగంలో ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్ ధరలు పెరిగిపోతుంటే.. ప్రభుత్వ రంగానికి చెందిన బిఎస్ఎన్ఎల్ మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొన్నటివరకు 4జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తూ వార్తల్లో నిలిచిన బీఎస్ఎన్ఎల్, ఇప్పుడు ఏకంగా దేశంలోనే అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ టెక్నాలజీతో ఒక సంచలన ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్. ఈ ఫోన్ వాడటానికి మీ చుట్టుపక్కల ఎలాంటి మొబైల్ టవర్స్ కానీ, ఎలాంటి సిగ్నల్స్ కానీ అవసరం లేదు. మీరు దట్టమైన అడవుల్లో, సముద్రం మధ్యలో లేదా ఎత్తైన పర్వతాల పైన ఉన్నా సరే.. ఈ ఫోన్ ద్వారా నేరుగా కాల్స్ మాట్లాడుకోవచ్చు.
Also Read : పెద్ద ప్లాన్‌తోనే జగన్ గోదారి పర్యటన..!
బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, ఈ శాటిలైట్ ఫోన్ ధరను రూ. 1,34,166 గా నిర్ణయించారు. ఇది గ్లోబల్ ఉపగ్రహ నెట్వర్క్ ప్రొవైడర్ అయిన ఇన్మార్శాట్ శాటిలైట్స్ సహాయంతో నేరుగా అంతరిక్షం నుండి కనెక్టివిటీని పొందుతుంది. తీవ్రమైన ఎండలు, మంచు మరియు భారీ వర్షాలను తట్టుకునేలా మిలిటరీ గ్రేడ్ రగ్గడ్ డిజైన్ తో ఈ ఫోన్ తయారు చేయబడింది. ఇందులో రోజుల తరబడి ఛార్జింగ్ వచ్చే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఒకే క్లిక్ తో రెస్క్యూ టీమ్స్ కు జీపీఎస్ లొకేషన్ సమాచారాన్ని పంపే ప్రత్యేక SOS అసిస్టెన్స్ బటన్ ను కూడా అందించారు.
Also Read : హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు అలర్ట్..!
అయితే ఈ ఫోన్ అందరూ వాడే సాధారణ స్మార్ట్ ఫోన్ కాదు. ఇది ముఖ్యంగా సరిహద్దుల్లో కాపలా కాసే డిఫెన్స్ ఫోర్సెస్, తుఫానులు-భూకంపాల సమయంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేసే విపత్తు నిర్వహణ బృందాలు, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు మరియు గనుల్లో పనిచేసే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ ఫోన్ కొనాలన్నా లేదా వాడాలన్నా భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ శాఖ నుండి ముందస్తుగా ప్రత్యేక అనుమతి పత్రం తీసుకోవడం నిబంధనల ప్రకారం తప్పనిసరి.

