Saturday, October 10, 2026 05:45 AM
Saturday, October 10, 2026 05:45 AM

ఫౌజీ టీం సంచలన ప్రకటన..!

బాలీవుడ్, టాలీవుడ్‌ లలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేష్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురై కోల్కతాలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న సమయంలో ఆయనను ఒక విష పురుగు కుట్టడం సంచలనం అయింది. మొదట్లో ఆయన దీనిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ కోల్కతాకు ప్రయాణమయ్యే లోపు ఆయన పరిస్థితి తీవ్రంగా విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు.

Also Read : అగ్రిగోల్డ్.. బాధితుల కోసం మెగా రోడ్ మ్యాప్..!

కీటకం కుట్టడం వల్ల జరిగిన ఇన్ఫెక్షన్, రాజేష్ శర్మకు ఉన్న అన్‌ కంట్రోల్డ్ డయాబెటిస్ కారణంగా మరింత జటిలంగా మారిందని వైద్యులు గుర్తించారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల శ్వాస ఆడకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం అందుతున్న చికిత్సతో ఆయన షుగర్ లెవెల్స్, శ్వాసకోశ సమస్యలు అదుపులోకి వచ్చినప్పటికీ, వైద్యులు ఆయనను ఇంకా నిరంతర పర్యవేక్షణలోనే ఉంచారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పడినట్లు కనిపిస్తున్నా, వైద్యులు ఆయనను ఇంకా పూర్తిగా ప్రమాదం నుండి బయటపడినట్లు ప్రకటించలేదు.

Also Read : టెట్‌పై వైసీపీ రాజకీయాలు బట్టబయలు?

రాజేష్ శర్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఫౌజీ చిత్ర నిర్మాణ సంస్థ.. మైత్రీ మూవీ మేకర్స్ పూర్తిగా ఖండించింది. రాజేష్ శర్మ ఆసుపత్రిలో చేరడానికి, సినిమా షూటింగ్‌ కు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. చిత్ర బృందం మీడియాకు ఇచ్చిన వివరణ ప్రకారం.. రాజేష్ శర్మ తమ సినిమాకు సంబంధించిన తన షెడ్యూల్ సీన్లను వారం రోజుల క్రితమే పూర్తి చేసుకుని, సురక్షితంగా కోల్కతాలోని తన ఇంటికి చేరుకున్నారు. తమ సెట్స్‌ లో ఎలాంటి కీటకం కుట్టిన సంఘటన కానీ, మెడికల్ ఎమర్జెన్సీ కానీ జరగలేదని, హను రాఘవపూడి దర్శకత్వంలో జరుగుతున్న ఈ షూటింగ్ సెట్స్‌లో అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నామని మేకర్స్ స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్