Thursday, July 9, 2026 06:47 PM
Thursday, July 9, 2026 06:47 PM

అగ్రిగోల్డ్.. బాధితుల కోసం మెగా రోడ్ మ్యాప్..!

8 రాష్ట్రాల్లోని 23,599 ఎకరాల భూములకు జియో ట్యాగింగ్.. ఏపీలో దాదాపు 12 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఏకంగా రూ.3,944 కోట్ల చెల్లింపు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మెగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. దాదాపు పదేళ్లుగా న్యాయం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఉన్న అన్ని రకాల న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి, వచ్చే ఆరు నెలల వ్యవధిలోనే ఆస్తుల వేలం ద్వారా బాధితులకు డబ్బులు చెల్లించేలా ఒక స్పష్టమైన కార్యాచరణను చేపడుతున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం అధికారికంగా ప్రకటించింది.

Also Read : రావణ్ కు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..!

ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వేయడంతో పాటు, ప్రతి 15 రోజులకోసారి మంత్రుల కమిటీ సమావేశమై పురోగతిని నిరంతరం సమీక్షించాలని నిర్ణయించింది. సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కేసుల ప్రస్తుత స్థితిగతులు, ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ, డిపాజిటర్ల క్లెయిమ్లపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో ‘ప్రత్యేక కోర్టు’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Also Read : అనంతపురంలో అలజడికి తోపుదుర్తి భారీ స్కెచ్ ..!

అగ్రిగోల్డ్‌కు చెందిన ఆస్తుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 23,599 ఎకరాల భూములను గుర్తించి, వాటిని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే అత్యధికంగా సుమారు 11.57 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని, వారికి రూ.3,944 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, సీఐడీ దర్యాప్తులో సుమారు రూ.2,000 కోట్ల విలువైన బాండ్లు ఏజెంట్ల వద్దనే ఉన్నట్లు గుర్తించామని, వాటిని 30 రోజుల్లోగా స్వాధీనం చేసుకునే చర్యలు ప్రారంభిస్తామన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల రికార్డులను, సర్వే నంబర్లను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, సీఐడీ వద్ద ఉన్న కొన్ని కీలకమైన హార్డ్ డిస్కులు కూడా కనిపించకుండా పోయాయని మంత్రి మనోహర్ ఆరోపించారు. వారి నిర్లక్ష్యం వల్లే సమస్య మరింత జటిలమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెద్ద ప్లాన్‌తోనే జగన్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

రావణ్ కు బిగ్...

సంచలన వీడియోలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా...

ఫౌజీ సెట్ లో...

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్...

అనంతపురంలో అలజడికి తోపుదుర్తి...

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు సవాల్...

గోదారమ్మకు జల కళ.....

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ...

ఆసక్తి రేపుతోన్న జనసేన...

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న...

పోల్స్