Tuesday, August 25, 2026 09:38 AM
Tuesday, August 25, 2026 09:38 AM

టీమిండియాకు గుడ్ న్యూస్..!

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వన్డే ఫార్మాట్ లోకి అడుగుపెట్టేందుకు కష్టపడుతున్నాడు. ఇంగ్లాండ్‌ తో జరగబోయే వన్డే సిరీస్ కోసం అతను నెట్స్‌ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత బుమ్రా మళ్లీ ఇప్పటివరకు వన్డే మ్యాచ్ ఆడలేదు. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ యాభై ఓవర్ల ఫార్మాట్‌ లో తన మార్క్ చూపించడానికి జస్సీ ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండ్ టూర్‌ కు ముందు బుమ్రా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : నా దగ్గర ఏనుగు దంతాలున్నాయి: మోహన్ లాల్ సంచలనం..!

కేవలం బ్యాట్, బాల్ ఎమోజీలతో షేర్ చేసిన ఈ ఫోటోల్లో అతను రెడ్ బాల్ తో నెట్స్‌ లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన బుమ్రా, ఈ రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ ద్వారా మళ్లీ తన మునుపటి ఫామ్‌ ను అందుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ సిరీస్ ద్వారా బుమ్రాతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. హ్యామ్‌ స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌ తో జరిగిన వన్డే సిరీస్‌ కు దూరమైన కోహ్లీ, ప్రస్తుతం ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించాడు.

Also Read : యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనా..?

జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కోసం కోహ్లీ సైతం ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల రాకతో టీమిండియా మరింత బలంగా మారనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు జస్ప్రీత్ బుమ్రా తిరిగి వన్డే జట్టులోకి రావడం టీమిండియాకు భారీ బూస్ట్‌ ఇస్తోంది. ఇంగ్లాండ్‌ తో జరగబోయే వన్డే సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరించనుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌ గా ఎంపిక అయ్యాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్