Friday, July 3, 2026 03:39 PM
Friday, July 3, 2026 03:39 PM

వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో ఆ సీన్…!

టాలీవుడ్‌లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ విక్టరీ వెంకటేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న మూవీ నుండి ఓ క్రేజీ అప్‌డేట్ లీక్ అయ్యింది. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీంతో సినీ లవర్స్ అంతా అక్టోబర్ రేసు కోసం వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఈ జోష్‌లో ఉండగానే.. వెండితెరపై వింటేజ్ వెంకీ అల్టిమేట్ కామెడీ క్రియేట్ చేయబోతున్న ఒక సరికొత్త ఎపిసోడ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి.

Also Read : సాయికృష్ణ మృతి కేసులో సంచలన మలుపు..!

విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెంబర్ 47’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ క్రేజీ చిత్రం రిలీజ్ డేట్‌పై కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు మేకర్స్ రీసెంట్‌గానే ఎండ్ కార్డ్ వేశారు. ఈ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ నుండి ఒక లేటెస్ట్ అప్‌డేట్ లీకై ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ప్రేక్షకులందరికీ ఒక అల్టిమేట్ విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఒక ట్రైన్ ఎపిసోడ్‌ను డైరెక్టర్ త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : ఆ విషయంలో మోదీ సైలెన్స్.. కాంగ్రెస్ ఫైర్..!

గతంలో రవితేజ నటించిన ‘వెంకీ’ సినిమాలోని ట్రైన్ కామెడీ సీన్ ఏ రేంజ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిందో.. ఇప్పుడు ఈ సినిమాలో రాబోతోన్న ఈ స్పెషల్ బ్లాక్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ట్రైన్ సీక్వెన్స్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీతో, మైండ్ బ్లాకింగ్ డైలాగ్ పంచ్‌లతో ఒక రేంజ్‌లో నవ్వుల సందడి సృష్టించబోతోంది. రీసెంట్‌గానే హైదరాబాద్‌లోని ఒక ప్రత్యేకమైన సెట్‌లో ఈ మేజర్ ఎపిసోడ్ షూటింగ్ మొత్తాన్ని చిత్ర యూనిట్ పూర్తి చేసింది. ఈ షూటింగ్ స్పాట్‌లో విక్టరీ వెంకటేష్ తన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో, సిగ్నేచర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చేసిన సీన్లు.. ప్రతి ఫ్రేమ్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఖాయమని ఇన్ సైడ్ టాక్ వినపడుతోంది.

Also Read : భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!

నిజానికి త్రివిక్రమ్ తన సినిమాల్లో కామెడీ ట్రాక్స్ రాస్తే అది ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారుతుంది. అందులోనూ వెంకటేష్ లాంటి నటుడికి అంటే.. ఈ ట్రైన్ సీన్ సినిమాకే బిగ్గెస్ట్ అసెట్ కానుంది. ఈ సినిమాలో వెంకటేష్ ఇద్దరు పిల్లల తండ్రిగా, పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే.. కథలో వచ్చే ఒక ఊహించని క్రైమ్ థ్రిల్లర్ ప్లాట్‌లోకి ఎలా చిక్కుకున్నాడనే పాయింట్‌ను త్రివిక్రమ్ తన మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో లార్జ్ స్కేల్‌లో మలిచారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి వెంకటేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా ముగించే పనిలో చిత్రబృందం శ్రమిస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో వచ్చే దసరా పండగ లాంగ్ వీకెండ్ సెలవుల అడ్వాంటేజ్‌ను వాడుకుంటూ అక్టోబర్ 2న రిలీజ్ డేట్ లాక్ చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

మావిగన్ సరే.. మరి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్...

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

సీఎంఓ‌లోకి మరో జగన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వైసీపీ అభిమాన...

తమిళ రాజకీయాల్లో సంచలనం.....

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ...

పోల్స్