ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే గుండెల్లో మంట, నోరంతా చేదుగా లేదా పుల్లగా మారడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారిలో ఈ మార్నింగ్ యాసిడ్ రిఫ్లక్స్ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి మందులు వాడటం కంటే, రాత్రి పూట భోజనం చేసే సమయాన్ని మార్చుకోవడమే అత్యంత ప్రభావవంతమైన సహజ నివారణోపాయమని హార్వర్డ్ మరియు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి స్పష్టం చేశారు.
Also Read : సాయి విషయంలో డ్యూయల్ రూల్.. కాపుల్లో ఆవేదన!
డాక్టర్ సౌరభ్ సేథి వివరణ ప్రకారం, రాత్రి ఆలస్యంగా తిని వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుంది. తిన్న వెంటనే పడుకోవడం వల్ల కడుపులోని యాసిడ్స్ పైకి గొంతులోకి తన్నుకు వస్తాయి. భోజనానికి, పడుకునే సమయానికి మధ్య కనీసం మూడు గంటల కంటే తక్కువ వ్యవధి ఉంటే గ్యాస్ట్రోఎసోఫేగియల్ రిఫ్లక్స్ డిసీజ్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ 40% నుండి 50% వరకు పడిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
Also Read : గ్లాసుతో ప్రేమలో పడ్డ కారు..?
అలాగే జీర్ణక్రియ వేగం తగ్గి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ ను తగ్గించడానికి సౌరభ్ సేథి రాత్రి 7:00 నుండి 7:30 గంటల లోపే డిన్నర్ ముగించాలని సూచించారు. పడుకోవడానికి కనీసం 3 గంటల ముందే తినడం వల్ల కడుపు ఖాళీ అయి, యాసిడ్ పైకి రాకుండా ఉంటుంది. దీంతో పాటు నిద్రపోయేటప్పుడు ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం వల్ల కడుపులోని యాసిడ్స్ గొంతులోకి రాకుండా నిరోధించవచ్చునని, అలాగే మంచం తల వైపు భాగాన్ని 6 నుండి 8 ఇంచులు ఎత్తులో ఉంచడం ద్వారా గురుత్వాకర్షణ శక్తి వల్ల యాసిడ్స్ పైకి రాకుండా చూసుకోవచ్చునని ఆయన వివరించారు. ఉదయాన్నే ఎసిడిటీతో బాధపడేవారు మందులపై ఆధారపడకుండా, తమ రాత్రి భోజన సమయాన్ని మార్చుకోవడం ద్వారా ఈ సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందవచ్చు.

