Saturday, September 19, 2026 09:07 AM
Saturday, September 19, 2026 09:07 AM

టీం ఇండియాకు మళ్ళీ బూమ్రా షాక్..!

శ్రీలంకతో జరగబోయే కీలక టెస్ట్ సిరీస్‌ కు ముందు టీమిండియాకు ఊహించని పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌ తో జరిగిన వన్డే సిరీస్ సమయంలో బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. ఆ గాయం నుండి ఆయన ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో, బీసీసీఐ మెడికల్ టీమ్ అతనిని తొందరపడి మైదానంలోకి దించడానికి నిరాకరించింది. ఆగస్టు 15 నుండి గాలే వేదికగా ప్రారంభం కానున్న ఈ రెండు టెస్టుల సిరీస్‌ కు బుమ్రా దూరం కావడం భారత బౌలింగ్ విభాగానికి పెద్ద లోటుగా మారనుంది.

Also Read : ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.. అర్థమైందా రాజా.. లోకేష్ మాస్ స్పీచ్..!

ఈ క్రమంలోనే జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే రీప్లేస్మెంట్ ఆటగాడి పేరును కూడా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌ కు చెందిన 29 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీకి భారత సీనియర్ జట్టు నుండి తొలిసారి పిలుపు వచ్చింది. దేశవాళీ క్రికెట్‌ లో గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో కలిపి ఏకంగా 104 వికెట్లతో చెలరేగిన నబీ, ఐపీఎల్ 2026 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ తర్వాత భారత జాతీయ జట్టుకు ఎంపికైన మూడో జమ్మూ కశ్మీర్ క్రికెటర్‌ గా ఆకిబ్ నబీ రికార్డు సృష్టించాడు.

Also Read : ధోనితో కలిసి జిమ్ లో పంత్.. కారణం ఏంటి..?

మరోవైపు యువ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ ఆడటంపై కూడా ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. ఇటీవల భారత్-ఎ సిరీస్ సందర్భంగా పాదానికి తగిలిన గాయం నుండి కోలుకుంటున్న సాయి సుదర్శన్, ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధిస్తేనే జట్టుతో కొనసాగుతాడని బోర్డు తెలిపింది. ఈ సిరీస్‌ కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌ గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నారు. బుమ్రా దూరమవ్వడంతో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌ లతో కూడిన భారత పేస్ విభాగానికి ఆకిబ్ నబీ తోడవ్వనున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్