Saturday, August 1, 2026 04:46 PM
Saturday, August 1, 2026 04:46 PM

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.. అర్థమైందా రాజా.. లోకేష్ మాస్ స్పీచ్..!

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన ప్రసంగంతో ఫుల్ జోష్ నింపారు. నాడు కొందరు అవహేళన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. “ఒకప్పుడు ఎర్రబస్సు కూడా సరిగ్గా రాదన్న చోట.. నేడు అంతర్జాతీయ ఎయిర్ బస్సు వచ్చి ల్యాండ్ అయింది. ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.. అర్థమైందా రాజా..” అంటూ ఆయన చేసిన కామెంట్స్ సభలో ఉన్న వారందరికీ ఫుల్ జోష్ వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రెక్కలు ఇచ్చారని లోకేష్ కొనియాడారు.

Also Read :మోడీని దారుణంగా మాట్లాడారు.. పవన్ సంచలన కామెంట్స్..!

ఈ చారిత్రాత్మక సభలో మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీ పేరు నమో అనే పదానికి తనదైన శైలిలో సరికొత్త అర్థాన్ని చెప్తూ రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించారు. నమో కా మతలబ్.. హిమ్మత్, విశ్వాస్, సురక్షిత్ భారత్, దుశ్శన్ కో ఢర్ అంటే నమో అంటే ధైర్యం, నమ్మకం, సురక్షిత భారతం, శత్రువులకు వణుకు.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహోన్నత స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడిచిన ఈ పుణ్యభూమి అభివృద్ధికి, ఏపీ ప్రగతికి ప్రధాని మోదీ ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తున్నారని లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read :భోగాపురంలో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!

ప్రధాని మోదీ ఆకాంక్షలైన వికసిత్ భారత్, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కు ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఒక నిలువెత్తు ప్రతిరూపమని లోకేష్ అభివర్ణించారు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం ఇకపై యావత్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ప్రధాన గ్రోత్ ఇంజన్ గా, పవర్ ఇంజిన్ గా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇంతటి అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో కూడిన విమానాశ్రయాన్ని అత్యంత శరవేగంగా, అద్భుతంగా నిర్మించిన జీఎంఆర్ సంస్థ యాజమాన్యానికి, ప్రతినిధులకు మంత్రి లోకేష్ ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

జనసేనాని ఆన్ డ్యూటీ.....

జనసేనలో రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థను...

పోల్స్