Friday, September 18, 2026 01:03 PM
Friday, September 18, 2026 01:03 PM

సనాతన ధర్మం.. చేప కూర చుట్టూ రాజకీయం..!

‘దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి దూరంగా ఉండాలి’ అంటూ బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను వివాదానికి దారితీశాయి. దేవీ నవరాత్రుల్లో మాంసాహారం తినేవారిని ‘పాషండులు’ అంటూ కృష్ణశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై బెంగాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. బీజేపీకి చెందిన బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కాళీఘాట్ కాళికాదేవి ఆలయానికి వెళ్లి చేప తల, వేయించిన చేప, బసంతీ పులావ్‌తో కూడిన భోగ్‌ను స్వీకరించడం చర్చకు కేంద్రబిందువైంది.

Also Read: ఆటో మార్కెట్‌లో మారుతి సుజుకి భారీ ప్లాన్..!

కౌశికి అమావాస్య సందర్భంగా కాళీఘాట్ ఆలయాన్ని దర్శించిన సువేందు అధికారి అమ్మ వారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సంప్రదాయంలో భాగంగా అందించిన భోగ్‌ను పూజారులతో కలిసి స్వీకరించారు. ఆయన ప్లేట్‌లో సాధారణ ప్రసాదం కాదు.. చేప తల కూడా ఉంది. బెంగాల్‌లోని శాక్తేయ సంప్రదాయంలో అమ్మవారికి చేప, మాంసాన్ని భోగ్ సమర్పించే ఆచారం కొన్ని ఆలయాల్లో కొనసాగుతోందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాళీఘాట్‌లో ఈ సంప్రదాయంలో భాగంగానే చేప భోగ్ అందించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ఒకవైపు బాగేశ్వర్ బాబా.. దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి దూరంగా ఉండాలని పిలుపు. మరోవైపు అదే బీజేపీకి చెందిన బెంగాల్ ముఖ్యమంత్రి.. కాళీమాత ఆలయంలో సంప్రదాయ చేప భోగ్ స్వీకరణ. అంటే.. సనాతనం ఒకటే.. సంప్రదాయాలు ప్రాంతానికో రకమా..? లేక.. ఉత్తర భారత సనాతన ప్లేట్‌లో పూరీ-సబ్జీ, బెంగాల్ సనాతన ప్లేట్‌లో చేప బుర్రా..? బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఈ వివాదంపై సీఎం సువేందు అధికారిస్పందించారు. ఇది వ్యక్తిగత విశ్వాసానికి, ఇతరులపై ఆహార నియమాలను రుద్దడానికి మధ్య తేడా ఉందని స్పష్టం చేశారు. శాస్త్రి తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందని, దాన్ని పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని సీఎం పేర్కొన్నారు. తాను మహాష్టమి, కార్తీక మాసంలో సాత్విక ఆహారం తీసుకుంటానని, అదే సమయంలో బెంగాలీ సంప్రదాయం ప్రకారం అమ్మవారి భోగ్‌లో చేప ఉంటే దానిని ప్రసాదంగా స్వీకరిస్తానని చెప్పారు. దీంతో సువేందు వ్యాఖ్యలపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. భక్తి ఒకటే కావచ్చు, భోగ్ మాత్రం ప్రాంతానికో రుచి.. అనే మాట వినిపిస్తోంది.

బెంగాల్లో చేప కేవలం ఆహారం కాదు. అక్కడి సాంస్కృతిక గుర్తింపులో ‘మాచా-భాత్’కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఒక సున్నిత మైన రాజకీయ సమీకరణ ఎదురైంది. ఒకవైపు దేశవ్యాప్తంగా సనాతన సంస్కృతికి ప్రతినిధిగా కనిపించాల్సిన అవసరం. మరోవైపు బెంగాల్లో స్థానిక ఆచారాలు, ఆహార సంస్కృతి, శాక్తేయ సంప్రదాయాలను గౌరవించాల్సిన రాజకీయ అవసరం. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా బెంగాలీ ఆహార సంప్రదాయాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు.

Also Read: దేశంలోనే నెంబర్ వన్.. వైద్య రంగంలో ఏపీ సరికొత్త రికార్డు..!

బాగేశ్వర్ బాబా వ్యాఖ్యలతో మొదలైన ‘చేప-మాంసం’ వివాదానికి కాళీఘాట్‌లో సువేందు అధికారి ఇచ్చిన సమాధానం ఇప్పుడు జాతీయ చర్చగా మారింది. సనాతన ధర్మం పేరుతో ఆహారాన్ని కూడా ఒకే కొలమానంతో కొలవచ్చా..? బెంగాల్ చెబుతున్న సమాధానం మాత్రం భిన్నంగా ఉంది. అమ్మవారికి భోగ్ చేప ఉంటే.. భక్తుడి ప్లేట్‌‌లో అది ప్రసాదమే. అందుకే ఈసారి రాజకీయ చర్చలో పూలు, కొబ్బరికాయలతో పాటు మరో అంశం కూడా ప్రధానమైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

దేశంలోనే నెంబర్ వన్.....

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ జాతీయ...

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

పోల్స్