మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాకరే బాలీవుడ్ నటులు వివేక్ ఓబెరాయ్, ఆర్. మాధవన్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముంబైలో జరిగిన మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన 20వ వర్ధంతి వేడుకల్లో మాట్లాడిన ఆయన.. దేశంలో నరేంద్ర మోదీ నేరత్వంలోని ప్రభుత్వం ప్రతిదీ అద్భుతంగా మార్చేసిందని నమ్మే ఈ నటులు భారత్ ను వదిలి దుబాయ్ లో ఎందుకు స్థిరపడ్డారని ప్రశ్నించారు. మోదీ బయోపిక్ లో నటించిన వివేక్ ఓబెరాయ్, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఎంతగానో సమర్థించే ఆర్. మాధవన్ వంటి వారు తమ కుటుంబాలతో సహా విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : ఉత్తరాంధ్ర కాదు.. ఇక ఉత్తమాంధ్ర.. మీరే నంబర్ వన్..!
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను సర్దుకుని ఇక్కడి నుండి వెళ్లిపోతున్నారని రాజ్ ఠాకరే ఆరోపించారు. ఈ నటులు మాత్రం కేవలం భారతదేశానికి వచ్చి ప్రభుత్వం స్పాన్సర్ చేసే ధురంధర్ లాంటి సినిమాల్లో నటిస్తూ, ఇక్కడి వ్యవస్థలను పొగుడుతూ మళ్లీ దుబాయ్‌కి పారిపోతున్నారని విమర్శించారు. కాగా, తన కుమారుడి స్విమ్మింగ్ కెరీర్ కోసం తాను దుబాయ్ వెళ్లానని గతంలో మాధవన్, అలాగే తన సొంత వ్యాపారాల నిమిత్తం అక్కడికి మారానని వివేక్ ఓబెరాయ్ గతంలో వెల్లడించినప్పటికీ, రాజ్ ఠాకరే వారిని ఈ వేదికపై గట్టిగా టార్గెట్ చేశారు.
Also Read : చంద్రబాబు రాజనీతి… అసలు లెక్క ఇదే!
ఇదే సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో వాడిన భాషను రాజ్ ఠాకరే తప్పుపట్టారు. ఏ ఒక్కరూ అంతటి దిగజారుడు భాషను వాడకూడదని, అయితే ఇదంతా బీజేపీకి చెందిన సోషల్ మీడియా ట్రోల్ టీమ్స్ ప్రారంభించిన సంస్కృతికి ప్రతిరూపమేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ మద్దతుదారులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీతో పాటు ఠాకరే కుటుంబ సభ్యులను కూడా ట్రోల్స్ పేరిట ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన సొంత పార్టీ శ్రేణులకు కూడా చెప్పి నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

