Saturday, September 19, 2026 06:53 AM
Saturday, September 19, 2026 06:53 AM

టీం ఇండియాకు భారీ బూస్ట్..!

శ్రీలంకతో జరగబోయే రాబోయే టెస్ట్ సిరీస్‌ కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఒక అద్భుతమైన శుభవార్త అందింది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఇంగ్లాండ్‌ తో జరిగిన వన్డే సిరీస్ సమయంలో బుమ్రా గాయపడటంతో అతను ఆడటంపై సందిగ్ధత నెలకొంది, కానీ ఇప్పుడు బూమ్రా కోలుకోవడంతో శ్రీలంక పర్యటనకు వెళ్లేందుకు బిసిసిఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న ఈ రెండు టెస్టుల సిరీస్ భారత్‌ కు ఎంతో కీలకం కానుంది.

Also Read : ధోనితో కలిసి జిమ్ లో పంత్.. కారణం ఏంటి..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ సైకిల్‌ లో నిలవాలి అంటే భారత్ ఈ సీరీస్ గెలవాల్సిందే. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా, ఫైనల్ రేసులో నిలవాలంటే రాబోయే మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో బుమ్రా లాంటి కీలక బౌలర్ జట్టులోకి రావడం జట్టు నైతిక బలాన్ని ఎంతగానో పెంచుతుంది. అయితే, బుమ్రా తిరిగి వచ్చినప్పటికీ భారత జట్టును గాయాల సమస్యలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి.

Also Read : ఉత్తరాంధ్ర కాదు.. ఇక ఉత్తమాంధ్ర.. మీరే నంబర్ వన్..!

ఇప్పటికే హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి గాయాల కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కాగా, వాషింగ్టన్ సుందర్ హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో మొదటి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. అలాగే వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న ఆకాశ్ దీప్ ఇంకా కోలుకుంటున్నారు. ఏదేమైనా, ప్రధాన పేసర్ బుమ్రా అందుబాటులోకి రావడం లంక పిచ్‌లపై భారత బౌలింగ్ విభాగానికి కొండంత అండగా మారనుంది. అటు యువ బౌలర్ లు జట్టులో ఎంత వరకు రాణిస్తారు అనేది చెప్పలేని పరిస్థితి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్