Tuesday, August 4, 2026 05:40 PM
Tuesday, August 4, 2026 05:40 PM

అశ్విన్‌కు సారీ చెప్పిన టీం ఇండియా స్టార్ బౌలర్..!

భారత క్రికెట్ జట్టు యువ పేసర్ అర్షదీప్ సింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ కు క్షమాపణలు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఒక టాస్క్‌ లో భాగంగా ప్రస్తుత క్రికెట్‌ లో తన దృష్టిలో ఉన్న టాప్-5 బౌలర్ల నైపుణ్యాలు, ప్రతిభ ఆధారంగా వారికి ర్యాంకులు ఇవ్వాలని అర్షదీప్‌ను కోరారు. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ మరియు రవిచంద్రన్ అశ్విన్‌ లను అతను సెలెక్ట్ చేసుకున్నాడు.

Also Read : జగన్ పర్యటన దెబ్బ.. ధర్మాన చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

అయితే ఇందులో అశ్విన్‌ను ఐదో స్థానంలో ఉంచాల్సి రావడంతో అర్షదీప్ సింగ్ సరదాగా స్పందించాడు. ఈ ర్యాంకింగ్స్ గురించి అర్షదీప్ మాట్లాడుతూ.. భువనేశ్వర్ కుమార్ తన పర్సనల్ ఫేవరెట్ బౌలర్ కాబట్టి కొద్దిగా పక్షపాతంతో ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎలాంటి వికెట్ పైనైనా బంతిని అద్భుతంగా సీమ్ చేయగల సామర్థ్యం ఉన్న మహమ్మద్ షమీని రెండో స్థానంలో, అరుదైన చైనామన్ స్కిల్స్ ఉన్న కుల్దీప్ యాదవ్‌ను మూడో స్థానంలో ఉంచాడు.

Also Read : రోజుకు రెండు అరటిపండ్లు తింటున్నారా..? ఈ విషయం తెలుసా..?

పంజాబ్ దేశీ జట్టులో తన సహచరుడైన యుజ్వేంద్ర చాహల్‌కు నాలుగో స్థానం ఇచ్చాడు. ఈ నలుగురి తర్వాత స్థానాలు ఖాళీ లేకపోవడంతోనే అశ్విన్ భాయ్‌ ను ఐదో స్థానంలో పెట్టాల్సి వచ్చిందని, ఆయనను తక్కువ అంచనా వేయడం తన ఉద్దేశం కాదని వివరించాడు. ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు తరఫున ఆడినప్పుడు అశ్విన్ తనకు మొదటి కెప్టెన్ అని అర్షదీప్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అందుకే అశ్విన్ భాయ్‌ కు ఐదో స్థానం ఇచ్చినందుకు క్షమించాలని కోరుతూ, దీని గురించి ఆయనకు వ్యక్తిగతంగా కూడా మెసేజ్ చేస్తానని నవ్వుతూ కామెంట్స్ చేసాడు. కాగా ప్రస్తుతం భారత జట్టు శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతుండగా, కేవలం వైట్-బాల్ క్రికెట్ ఆడే అర్షదీప్ సింగ్‌ కు ఈ సిరీస్ నుండి విశ్రాంతి లభించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్