ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ అప్‌డేట్స్ ను పంచుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు వారణాసి అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేయగా, ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడిన జక్కన్న సినిమా కథాంశంపై అదిరిపోయే హింట్స్ ఇచ్చారు. దాదాపు నాలుగేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని, కేవలం 20 శాతం మాత్రమే టాకీ పార్ట్ పెండింగ్ ఉందని క్లారిటీ ఇచ్చారు.
Also Read : రాజకీయాల్లోకి త్రిష..? సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..?
ఈ సినిమా కథ గురించి రాజమౌళి వివరిస్తూ, తనకు చిన్నప్పటి నుండి ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పారు. వారణాసి కథాంశం ప్రేక్షకులను ఊహించని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని అన్నారు. కథ వారణాసిలో ప్రారంభమై అంటార్కిటికా మంచు ఖండాలు, ఆఫ్రికా అడవుల గుండా ప్రయాణిస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో ప్రాచీన రోమ్ సామ్రాజ్యం మరియు పురాణాల్లోని రామాయణ కాలానికి కూడా ప్రేక్షకులను తీసుకువెళ్లి, చివరకు మళ్లీ వారణాసిలోనే ముగుస్తుందని జక్కన్న లీక్ చేశారు.
Also Read : దేశంలో మరో వైరస్.. పిల్లలే టార్గెట్..?
ఈ చిత్రం ప్రపంచ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఐమ్యాక్స్ ఫార్మాట్ లో పూర్తి స్థాయిలో చిత్రీకరించబడుతున్న మొట్టమొదటి నాన్-ఇంగ్లీష్ సినిమాగా వారణాసి రికార్డులకెక్కింది. ఐమ్యాక్స్ స్క్రీన్ కోసం అంటార్కిటికాలోని 300 అడుగుల ఎత్తైన మంచు కొండలు, ప్రాచీన రోమ్ నగరానికి చెందిన భారీ సైన్యాల యుద్ధ సన్నివేశాలను అత్యంత విజువల్ గ్రాండ్‌నెస్ తో షూట్ చేసినట్లు రాజమౌళి వివరించారు. దీని కోసం హాలీవుడ్‌కు చెందిన టాప్ విఎఫ్‌ఎక్స్ కంపెనీలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని సమాచారం. ఈ హై-వోల్టేజ్ అడ్వెంచర్ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకూమారన్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

