Saturday, September 19, 2026 09:19 AM
Saturday, September 19, 2026 09:19 AM

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..?

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న హైడ్రామా ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. డీఎంకే అగ్రనేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కావడానికి కారణమైన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్, త్వరలోనే నేరుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు తమిళనాట దావానలంలా వ్యాపిస్తోంది. కేవలం ఊహాగానాలే కాకుండా, నిన్నటి నుండి సోషల్ మీడియా వేదికగానూ, అటు తమిళనాడులోని పలు ప్రధాన నగరాల్లోనూ త్రిష రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ అభిమానులు, అధికార టీవీకే శ్రేణులు పెద్ద ఎత్తున బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

Also Read : బ్రేకింగ్: విజయ్ పై కామెంట్స్.. స్టాలిన్ అరెస్ట్..!

ఈ మొత్తం వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పక్కా వ్యూహం ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌ లో గట్టిగా వినిపిస్తోంది. త్రిషను ఎవరైనా ఒక్క మాట అన్నా సరే, సీఎం విజయ్ ఏమాత్రం సహించకుండా కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించి మరీ అరెస్టులు చేయిస్తున్నారు. ఒక నటి కోసం ప్రతిపక్ష నేతను సైతం జైలుకు పంపేంతలా ప్రభుత్వం రియాక్ట్ అవ్వడం వెనుక కేవలం మహిళా గౌరవమే కాకుండా, రాబోయే రోజుల్లో ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలనే బలమైన సంకల్పం కూడా దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : పాక్‌ లో భారత ఏజెంట్ ల వేట.. ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు..!

ప్రస్తుతం వినిపిస్తున్న లీకుల ప్రకారం.. సీఎం విజయ్ తాను రాజీనామా చేసిన అత్యంత కీలకమైన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం ఉపఎన్నికలో టీవీకే పార్టీ తరఫున త్రిషను బరిలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. గ్లామర్‌ తో పాటు ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న త్రిషను అక్కడ పోటీ చేయించి, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విజయ్ భావిస్తున్నారట. అంతేకాకుండా, ఆమెను అసెంబ్లీకి పంపడమే కాకుండా నేరుగా తన క్యాబినెట్‌ లోకి తీసుకుని సాంస్కృతిక లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పదవిని కట్టబెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు త్రిషకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తూనే, మరోవైపు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విపక్ష డీఎంకేను డిఫెన్స్‌ లో పడేసేందుకు విజయ్ సర్కార్ ఈ అస్త్రాన్ని వాడుకుంటోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

పోల్స్