Saturday, September 19, 2026 10:01 AM
Saturday, September 19, 2026 10:01 AM

ఏపీ లిక్కర్ కుంభకోణం.. జగన్ కథ ముగిసినట్లేనా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ అక్రమ మద్యం పాలసీ వ్యవహారంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మాజీ అదనపు కమిషనర్, మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ కోర్టుకు సమర్పించిన ఒప్పుకోలు వాంగ్మూలం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది. ఈ లీలల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఎవరెవరికి ఎంత మొత్తంలో వాటాలు వెళ్ళాయి అనే ముఖ్యాంశాలను ఆయన పూసగుచ్చినట్టు విచారణలో వెల్లడించారు.

Also Read : Poll : దానం నాగేందర్ అనర్హత విషయంలో తెలంగాణ హైకోర్టు సరైన నిర్ణయం తీసుకుందని మీరు భావిస్తున్నారా?

ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన పూర్తి వ్యూహం, స్కెచ్ అంతా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసంలోనే జరిగిందని సత్యప్రసాద్ తన వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేశారు. నాటి ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే మద్యం కంపెనీల కేటాయింపులు, బ్రాండ్ల పంపిణీ ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం ద్వారా ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏకంగా రూ. 3,200 కోట్ల రూపాయల మేర భారీగా మద్యం ముడుపులు అందినట్లు సత్యప్రసాద్ స్పష్టం చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read : రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు ముచ్చెమటలు..!

ఆటోమేటిక్ ఈఎఫ్బీఎస్ సాఫ్ట్‌వేర్ నిలిపివేసి మ్యాన్యువల్ ఆర్డర్లతో దోపిడీ చేశారని, సాక్ష్యాలు దొరకకుండా 29 డిపోల డేటాను పూర్తిగా చెరిపివేశారని పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో తాను అప్రూవర్‌ గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ దోపిడీ నెట్‌వర్క్ వెనుక ఉన్న పూర్తి నిజాలను బయటపెడతానని సత్యప్రసాద్ విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయాధికారి, నిన్న సత్యప్రసాద్‌కు సంబంధించిన సంచలన వాంగ్మూలాన్ని అధికారికంగా రికార్డు చేశారు. ఏసీబీ కోర్టు కనుక ఈ అప్రూవర్ పిటిషన్‌ను అంగీకరిస్తే, రాబోయే రోజుల్లో వైస్సార్సీపీ అగ్రనేతలకు మరియు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చట్టపరంగా మరిన్ని ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

పోల్స్