Sunday, September 20, 2026 04:33 PM
Sunday, September 20, 2026 04:33 PM

వెంటాడుతున్న ED.. వేల కోట్ల స్కామ్‌లో వైసీపీ సీనియర్‌ నేత

వైసీపీ నేతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ – ED వెంటాడుతోంది. వరుస కుంభకోణాల్లో ఆ పార్టీ నేతల పేర్లు, బినామీ లావాదేవీలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో..ఈడీ స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. ఫ్యాన్‌ పార్టీ నేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు లిక్కర్ స్కామ్‌, టీటీడీ కల్తీ నెయ్యి విచారణలో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతల పాత్రపై ఈడీ ఉచ్చు బిగుస్తుండగానే..తాజాగా మరో వైసీపీ నేత మెడకు మనీ లాండరింగ్ ఉచ్చు బిగిసింది. సామాన్యుల సొమ్మును కొల్లగొట్టి కోట్లు గడించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ MLA మళ్ల విజయప్రసాద్‌పై ఈడీ మెరుపు దాడులు చేపట్టింది.

Also Read : రసవత్తరంగా స్థానిక పోరు.. కూటమి పార్టీల సిగపట్లు..!

ఆయన ఛైర్మన్‌గా ఉన్న వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వేదికగా జరిగిన భారీ ఆర్థిక అక్రమాలపై అందిన పక్కా సమాచారంతో.. బిహార్, ఒడిశాలకు చెందిన ప్రత్యేక ఈడీ బృందాలు హైదరాబాద్, విశాఖలోని ఆయన నివాసాలు, ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. ఈ దాడుల వెనుక ఏకంగా రూ.3,000 కోట్లకు పైగా డిపాజిట్లు, చిట్‌ఫండ్ కుంభకోణం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. వెల్ఫేర్ గ్రూప్ ముసుగులో ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ ప్లాట్లు, అధిక వడ్డీల ఆశచూపి సామాన్య, మధ్యతరగతి ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లలో ఏజెంట్ల ద్వారా వేలాది మంది నుంచి వందల కోట్లు వసూలు చేసి, తీరా గడువు ముగిశాక డిపాజిటర్లకు మొండిచేయి చూపించారు.

గతంలో ఈ వెల్ఫేర్ మోసాలపై ఒడిశా CIDతో పాటు సీబీఐ కూడా విచారణ జరిపింది. అయితే, ప్రజల నుంచి లాగేసిన వేల కోట్ల డబ్బును ఇతర వ్యాపారాలకు, బినామీ కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారణ కావడంతో మనీ లాండరింగ్ కోణంలో ఇప్పుడు ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. బినామీల పేర్లతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు? ఏయే వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేశారన్న కోణంపై అధికారులు ప్రస్తుతం కూపీ లాగుతున్నారు.

Also Read : వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు..!

మళ్ల విజయప్రసాద్ ఎపిసోడ్ వైసీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుండగా..ED తదుపరి టార్గెట్ ఎవరు.. అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీకి చెందిన బినామీల బాగోతాలు వెలుగుచూడటంతో, ఎవరి మెడకు ఎప్పుడు ఉచ్చు బిగుస్తుందోనన్న ఆందోళన మొదలైంది. దీనికి తోడు, రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా జరిగిన ఇసుక, మైనింగ్ కుంభకోణాలు, విశాఖలో భారీ ఎత్తున జరిగిన భూకబ్జాలు, మద్యం సిండికేట్ లావాదేవీలపై కూడా త్వరలో ED ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. సామాన్యుల పొట్టకొట్టి వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చని భావించిన వైసీపీ అక్రమార్కులపై కేంద్ర సంస్థలు వరుసగా గురిపెట్టడం వణుకు పుట్టిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్