Saturday, September 19, 2026 07:37 PM
Saturday, September 19, 2026 07:37 PM

తిరుమల లడ్డూ పై, జగన్ కి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందా?

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ దర్యాప్తు సంస్థ, కేవలం ఆర్ధిక అవకతవకలని మాత్రమే విచారణ చేస్తుంది. ఆర్ధిక లావాదేవీలలో అక్రమాలు జరిగితేనే ఈడీ ఎంటర్ అవుతుంది. అంతే కానీ, ఆ కేసు ఏంటి ? ఆ కేసులో ఆరోపణలు నిజమా కాదా అని ఎక్కడా చెప్పదు. ఈ కనీస అవగాహన కూడా లేని వైసీపీ పార్టీ, తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని ఈడీ తీర్పు ఇచ్చినట్టు డబ్బా కొట్టుకుంటున్నారు.

Also Read : ఇప్పటికీ వారికే పదవులు.. ఎందుకీ నిర్లక్ష్యం..?

అసలు ఈడీ రిపోర్ట్ లో ఏముంది ?
ఈడీ ఎక్కడా కూడా జగన్ రెడ్డి హయాంలో తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని రిపోర్ట్ ఇవ్వలేదు. తిరుమల లడ్డూ కల్తీ జరిగింది, దీని వెనుక భారీగా కోట్ల రూపాయల డబ్బు చేతులు మారాయని నిర్దారించింది. జగన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.230 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వెల్లడించింది. సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఈడీ రంగప్రవేశం చేసిందని తెలిపింది.

ఈ ఏడాది జూన్‌లో దేశ వ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు జరపగా.. తాజాగా ఇదే కేసులో కైలాష్‌చంద్‌ మాంగ్లాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ డైరెక్టర్‌ విపిన్‌ జైన్‌ను అరెస్టు చేశారు. సుకృతి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌గా ఉన్న కైలాష్‌చంద్‌ మాంగ్లా కల్తీ నెయ్యి తయారీలో ముఖ్యపాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. రిఫైన్డ్‌ పామాయిల్, పామ్‌ కెర్నల్‌ ఆయిల్, పామోలిన్, మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్‌ యాసిడ్‌ ఈస్టర్, ఎంజీ-90, మైవాసెట్‌ సాఫ్ట్‌ 400 వంటి రసాయనాలు ఉపయోగించి నకిలీ నెయ్యిని తయారు చేసారని ఈడీ చెప్పింది.

Also Read : సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.. లేదా..?

2019-24 మధ్య సుమారు రూ.230 కోట్ల విలువైన నెయ్యిని సరఫరా చేయగా.. ఇందులో దాదాపు రూ.96 కోట్ల విలువైన నెయ్యి కైలాష్‌చంద్‌ మాంగ్లానే కల్తీ చేసాడు. జగన్ రెడ్డి హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగింది నిజం అని ఈడీ అరెస్ట్ లు కూడా చేస్తూ, దీని వెనుక జరిగిన మనీ లాండరింగ్‌ బయట పెడితే, మాకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని సిగ్గు వదిలేసి జగన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు.. హిందూ వ్యతిరేకి జగన్ రెడ్డి, ఎన్ని పాపాలు చేసాడో ప్రతి హిందువుకి తెలుసు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

పోల్స్