Thursday, August 6, 2026 06:35 PM
Thursday, August 6, 2026 06:35 PM

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం సహజం. అయితే అలా పదవీ విరమణ చేసే ముందే.. ఆ అధికారి లేదా ఉద్యోగి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. కొత్త అధికారి వచ్చి.. పాత అధికారి నుంచి బాధ్యతలను అధికారికంగా స్వీకరిస్తారు. బదిలీ అయినా సరే.. రిటైర్ అయినా సరే.. ఇదే విధానం అనుసరిస్తారు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఎందుకిలా అని సచివాలయ ఉద్యోగుల నుంచి సీనియర్ అధికారుల వరకు చర్చించుకుంటున్నారు. కిందిస్థాయి ఉద్యోగులు రిటైర్ అయితేనే.. వెంటనే కొత్త వారికి ఆ బాధ్యతలను అప్పగించే ప్రభుత్వం.. ఏకంగా శాఖాధిపతులు రిటైర్ అయినా కూడా.. ఆ పోస్టులను భర్తీ చేయలేదు.

Also Read : వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు..!

పరిపాలన సజావుగా సాగాలంటే ముందు ఉన్నతాధికారి ఉండాలి. అప్పుడే కిందిస్థాయి ఉద్యోగులకు భయం ఉంటుంది. అదే ఉన్నతాధికారి స్థానం ఖాళీగా ఉంటే.. అప్పుడు ఆ శాఖ పనితీరు పూర్తిగా ఆగిపోతుంది కూడా. శాఖాధిపతులు రిటైర్ అయ్యి వారం గడిచినా.. ఎంతో అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు కూడా ఆ పోస్టులను భర్తీ చేయలేదు. సాధారణంగా ఐఏఎస్ స్థాయి అధికారుల బదిలీలు, కీలక స్థానాల్లో పోస్టీంగ్‌ల విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదంటున్నారు సన్నిహితులు. ఇందుకు ప్రధానంగా పార్టీ నేతలతో పాటు ప్రభుత్వంలో కీలక నేతల ప్రభావం బలంగాా ఉందంటున్నారు.

సీఎం చంద్రబాబు కంటే కూడా సీఎంఓలోని ఐఏఎస్ అధికారులే కీలకంగా ఉన్నారనే ఆరోపణలు తొలి నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి చంద్రబాబు దగ్గర అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే భయపడతారు కూడా. కానీ ప్రస్తుత సీఎంఓ అధికారులు మాత్రం అలా కాదు. అందుకు కారణం.. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న నేతల అండ తమకే ఉందని.. కాబట్టి ఎవరికీ భయపడేది లేదంటున్నారు. అందుకే ఇలా ఉన్నతాధికారులు రిటైర్ అయిన ఫైల్ కూడా చంద్రబాబు వరకు చేరకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాస్తవాలను సీఎం వరకు చేరకుండా చేస్తున్నారంటే.. అసలేం జరుగుతుందో అంతుబట్టటం లేదంటున్నారు.

చంద్రబాబు స్పీడ్‌కు ముఖ్యనేతలు బ్రేకులు వేస్తున్నారా.. అనే ప్రశ్న సచివాలయంలో బాగా వినిపిస్తోంది. సచివాలయంలో కృష్ణబాబు, అజయ్ జైన్ సర్వీస్ నుండి రిటైర్ అయ్యి ఇప్పటికే వారం రోజులు దాటింది. అయినా సరే.. వారి స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. ఇంకా చెప్పాలంటే.. ఆ శాఖలకు ఇన్‌ఛార్జులను కూడా ఇప్పటి వరకు నియమించలేదు. నిజానికి గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. ఒక అధికారి పదవీ విరమణ చేస్తున్నాడంటే.. దాదాపు నెల రోజుల ముందు నుంచే.. ఆ స్థానం ఎవరితో భర్తీ చేయాలా అని చంద్రబాబు కసరత్తు చేస్తారు. సరైన అధికారి అందుబాటులో లేకపోతే.. రిటైర్డ్ అధికారి స్థానంలో ఇంఛార్జును అయినా నియమిస్తారు.

Also Read : రసవత్తరంగా స్థానిక పోరు.. కూటమి పార్టీల సిగపట్లు..!

రెండు ప్రధాన శాఖల అధిపతులు రిటైర్డ్ అయినా సరే.. ఇప్పటి వరకు భర్తీ చేయకపోగా.. కనీసం ఇంఛార్జులను కూడా ఎందుకు నియమించలేదని సచివాలయంలో జోరుగా చర్చ నడుస్తోంది. చంద్రబాబుతో తొలి నుంచి సన్నిహితంగా మెలిగిన అధికారులు అయితే.. అసలు ఇది చంద్రబాబు మార్కు పాలనేనా అని అనుమానపడుతున్నారు. నిజానికి ఇప్పటికే కీలక, ప్రాధాన్యత శాఖాధిపతులుగా వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులే బాధ్యతలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న శాఖాల్లో కూడా మళ్లీ వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులనే నియమిస్తారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సీఎంఓలో వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులే చక్రం తిప్పుతున్నారనేది బహిరంగ రహస్యం. అపార అధికార అనుభవంతో పాటు, ముక్కుసూటిగా మాట్లాడుతారనే పేరున్న సీఎస్ సాయిప్రసాద్ కూడా తనదైన శైలిలో పనిచేయటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విమర్శలకు చంద్రబాబు ఎప్పుడు చెక్ పెడతారో వేచి చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ ఫేక్ ప్రచారానికి...

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం...

వెంటాడుతున్న ED.. వేల...

వైసీపీ నేతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ -...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది....

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

పోల్స్