Wednesday, August 5, 2026 03:46 PM
Wednesday, August 5, 2026 03:46 PM

టాక్స్ చెల్లింపులో రిషభ్ పంత్ క్రేజీ రికార్డ్..!

క్రికెట్ మైదానంలో తన మెరుపు బ్యాటింగ్‌ తో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పుడు పన్నుల చెల్లింపులోనూ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆర్థిక సంవత్సరం 2025-26 కు గానూ అతను ఏకంగా ₹23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి సరికొత్త సంచలనం సృష్టించాడు. ఈ భారీ మొత్తంతో పంత్ తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌ లోనే అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించిన నంబర్-1 పన్ను చెల్లింపుదారుడిగా నిలిచారు.

Also Read : జంతర్ మంతర్ నిరసనల్లో ఐఎస్ఐ ఏజెంట్ల భారీ ప్లాన్..?

ఈ మేరకు 167వ ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్‌ లో నిర్వహించిన ఒక ప్రత్యేక గౌరవ సదస్సులో ఉత్తరాఖండ్ ప్రధాన ఆదాయపు పన్ను కమిషనర్ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అత్యధిక పన్నులు కట్టిన ప్రముఖుల వివరాలను కూడా ఐటీ శాఖ ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, గుజరాత్ నుంచి గౌతమ్ అదానీలు అగ్రస్థానంలో నిలవగా, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంత రాష్ట్రం నుంచి ఒక యువ క్రికెటర్ ఈ స్థాయి గుర్తింపు సాధించడం విశేషం.

Also Read : బీసీలకు ఏపీ సర్కార్ బిగ్ గిఫ్ట్..!

ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత కేటగిరీలో రిషభ్ పంత్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, నాన్-కార్పొరేట్ విభాగంలో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు, ఇదే ఉత్తరాఖండ్ రాష్ట్ర కార్పొరేట్ విభాగంలో ఓఎన్జీసి సంస్థ ఏకంగా ₹13,564 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మైదానంలోనే కాకుండా పౌరుడిగా దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా పన్నులు కట్టి తోడ్పాటు అందిస్తున్న రిషభ్ పంత్‌ పై క్రీడా ప్రేక్షకులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్