Monday, June 22, 2026 03:51 PM
Monday, June 22, 2026 03:51 PM

సాయి విషయంలో డ్యూయల్ రూల్.. కాపుల్లో ఆవేదన!

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక క్లూ ఇచ్చారు. లాకప్ డెత్‌లు సహజమే, దానికి ట్రాన్స్‌ఫర్ సహజమే.. ‘నా చిన్నప్పటి నుండి చూశా. కానీ శవాన్ని కాల్చేశారు, ఇదే అతి పెద్ద నేరం’ అన్నట్లు మాట్లాడారు. కేవలం తల్లికి బూడిద ఇవ్వలేదు అనే సెంటిమెంట్ దగ్గరే చర్చను కేంద్రీకృతం చేశారు. దానితో పాటు ‘మా కాపులే, చుట్టాలే అయినా జనసేనకు మద్దతుగా.. నన్ను తిట్టేవారు. ఆయన మేనమామ రంగా, రాధ మిత్ర మండలి, కాపు నాయకుడు. కానీ నేను న్యాయం కోసం…’ అంటూ కులానికి మొత్తం సందేశం పంపారు. పెద్ద మేనమామ ఇంటర్వ్యూలు కూడా అంబటి కుల ప్రస్తావనను సమర్థిస్తూ సాగాయి.

Also Read : సాయికృష్ణ వ్యవహారంలో వైసీపీకి ఒరిగిందేమిటి?

సీబీఐ దర్యాప్తును అడగాల్సింది వారి కుటుంబ సభ్యులు. వివేకానంద రెడ్డి కేసులో సునీత పోరాటాన్ని చూసిన తర్వాత రాష్ట్ర పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ను ఎవరూ వద్దనుకోరు. ఆ తల్లి, చిన్న మేనమామ క్లారిటీగా “మాకు చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం వుంది. మాకు మాట ఇచ్చారు. ఇక కులానికి అంటగట్టకండి” అని చిన్న మేనమామ కొంత గట్టిగా.. పెద్దన్న కూడా వినేలా, ఆవేశంగా చెప్పారు. ఓ వైపు దర్యాప్తు మొదలవ్వగానే.. సాక్షిని స్మశానంలో అస్థికలు భద్రపరిచే చోటకు పంపి అత్యుత్సాహం చూపారు. కానీ ఆశ్చర్యంగా, “పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, సీబీఐ దర్యాప్తు కావాలి” అంటూ అక్కడక్కడా సాక్షిని వెంటబెట్టుకుని వైసీపీ హడావిడి చేసింది. లిక్కర్ స్కాములో కారుమూరి కొడుకుని ఈడీ అరెస్ట్ చేస్తే, అది చంద్రబాబే చేయించారని చెప్పారు.

ఇలాగే గతంలో “మన పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు” అని కోడికత్తి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కోరారు. ఏకంగా డీఎస్పీలంతా కమ్మ కులం వారే అని ఢిల్లీలో పచ్చి అబద్ధపు ప్రచారం చేశారు జగన్. కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పడానికి కూడా బాధితుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లకపోవడం ఆశ్చర్యం. గులక రాయి హత్యా ప్రయత్నం మీద సీబీఐ దర్యాప్తు కోరలేదు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య మీద అడగలేదు. వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేసి, అధికారంలోకి రాగానే అవసరం లేదని హైకోర్టులో అధికారికంగా అఫిడవిట్ దాఖలు చేశారు జగన్. ఇప్పుడు మాత్రం సీబీఐ డిమాండ్ చేయడమంటే ఈ చర్చ ఇలాగే కొనసాగాలనేది వైసీపీ కోరిక.

మరోవైపు పోలీస్ వ్యవస్థలో ఇలాంటి చట్ట ఉల్లంఘనలు చాలానే జరుగుతున్నా.. ఒక్క కృష్ణలంక సీఐ నాగరాజు ఒక్కడిపైనే కేసు బుక్ చేయడాన్ని ఎత్తి చూపి.. ‘పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కాపు కులస్థులకు జరుగుతున్న అన్యాయం’ అంటూ మళ్లీ మనం ఒక ఉద్యమాన్ని ఇటు నుంచి నడుపుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? అని వైసీపీ ఆలోచిస్తోందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాన్ని నిజం చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో సీఐ నాగరాజుకు మద్దతుగా కొన్ని పోస్టులు వైరల్ చేస్తున్నారు.

Also Read : కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ మందులపై తక్షణ నిషేధం..!

ఇరువైపులా ఒకే కులం అని రాజకీయ కత్తిని రెండు వైపులా తిప్పుతున్నారు. కత్తి పట్టినవాడు దానికే బలవుతాడు. పెళ్లిళ్లకు కూడా జనం కులాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం రాజకీయ నాయకుల్లో తప్ప సమాజంలో పెద్దగా పట్టింపులు లేవు. పైగా ఏ కులాలూ ఆయా కులాలను ఆదుకోవడం లేదు. క్రిమినల్స్ కేసుల్లో కులం పేరు వాడుతూ.. ‘వారు అలాంటి వారే’ అని ముద్ర వేసే ఎజెండాను వైసీపీ అందుకుందా? దానికి కౌంటర్‌గానే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారా? అనే చర్చ జరుగుతోంది.

మొదటి నుండి కాపులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అంబటిని పావును చేసి చంద్రబాబును బూతులు తిట్టించి, పెట్రోల్ సీసాలు వేయించుకుని, అరెస్ట్ అయ్యేలా అతిగా ప్రవర్తించేలా చేసి.. ‘కాపు సామాజిక వర్గానికి జరిగిన అన్యాయం’ అంటూ ఆయన్ను పరామర్శిస్తున్నట్లుగా రోజుకొక వైసీపీ నాయకుడిని పంపినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ అదే అంబటిని పావుగా ముందు పెట్టి, పిల్లా సాయి విషయంలో సమాజంలో కులాన్ని రెండు వైపులా బద్నాం చేసే బరితెగింపు రాజకీయాలు వైసీపీ చేస్తోందని కాపుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.....

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు....

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

సాయి కృష్ణ కేసులో...

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో...

పవన్ కు ఆ...

ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్...

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

పోల్స్