Thursday, August 6, 2026 07:20 PM
Thursday, August 6, 2026 07:20 PM

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్‌

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా మార్చడమే కాకుండా, జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసేందుకు లోకేశ్ అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ చేరుకున్న లోకేష్‌కు కూటమి ఎంపీలు ఘనస్వాగతం పలికారు.

ఢిల్లీ చేరుకున్న వెంటనే లోకేష్ కూటమి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కేంద్రంలో NDA భాగస్వామిగా TDP పోషించాల్సిన క్రియాశీలక పాత్రపై సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంటు వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దేశ రాజధాని రాజకీయాల్లో చంద్రబాబు నాయుడి తర్వాత అదే స్థాయిలో లోకేష్ ఎదుగుతున్నారనే సంకేతాలు ఈ పర్యటన ద్వారా మరోసారి స్పష్టమయ్యాయి.

Also Read : పవన్ కు ఆ శాఖ కూడా..? దసరా తర్వాత ఏపీ కేబినెట్‌ లో మార్పులు..!

ఇక, ఈ పర్యటనలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ సదస్సులో లోకేష్ పాల్గొంటారు. జాతీయ స్థాయి రాజకీయ నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, మేధావుల సమక్షంలో లోకేశ్ తన సరికొత్త విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానాన్ని, ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో రాబోయే విప్లవాత్మక మార్పులను ఆయన జాతీయ వేదికపై బలంగా వినిపించనున్నారు. దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుడిగా ఎదిగిన లోకేష్..జాతీయ మీడియా దృష్టిని సైతం తన వైపు తిప్పుకుంటూ ఏపీ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

సదస్సు ముగిసిన అనంతరం, పలువురు కేంద్ర మంత్రులను కూడా లోకేష్ కలవనున్నారు. ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్‌లు లేకపోయినప్పటికీ, కేంద్ర క్యాబినెట్‌లోని కీలక మంత్రులతో లోకేశ్‌ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ పర్యటన ద్వారా అటు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన కేంద్ర మద్దతును సాధించడంతో పాటు, జాతీయ రాజకీయాల్లో తన హవాను, తనదైన లీడర్‌షిప్ మార్క్‌ను లోకేష్ మరోసారి నిరూపించుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పొగాకు రైతులపై జగన్‌...

దేవరాపల్లిలో వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు...

వైసీపీ ఫేక్ ప్రచారానికి...

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం...

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం...

వెంటాడుతున్న ED.. వేల...

వైసీపీ నేతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ -...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది....

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

పోల్స్