Thursday, August 6, 2026 05:03 PM
Thursday, August 6, 2026 05:03 PM

పవన్ కు ఆ శాఖ కూడా..? దసరా తర్వాత ఏపీ కేబినెట్‌ లో మార్పులు..!

ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం శాఖపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారాయి. కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “తాను హోం మంత్రిని కాకపోవడమే రాష్ట్రంలోని క్రిమినల్స్ అదృష్టం” అని కామెంట్ చేసారు. ఈ నేపథ్యంలో, రానున్న దసరా పండుగ తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు జరగవచ్చని, అప్పుడు పవన్ కళ్యాణ్‌ కు హోం శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Also Read : బిజేపిలో ఏం జరుగుతోంది..? రాజనాథ్ ఇంట్లో కీలక భేటీ..!

ప్రస్తుతం హోం శాఖను వంగలపూడి అనిత నిర్వహిస్తుండగా, క్షేత్రస్థాయిలో లా అండ్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ వంటి శక్తివంతమైన నాయకుడే సరైన వ్యక్తని కూటమి పెద్దలు భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనేది సీఎం చంద్రబాబు ప్రధాన వ్యూహంగా కనపడుతోంది. పవన్ కళ్యాణ్‌ కు ఉన్న ప్రజాదరణ, నిక్కచ్చిగా వ్యవహరించే శైలిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో రౌడీయిజం, క్రిమినల్స్ అణచివేతకు ఆయనే సరైన వ్యక్తి అని భావిస్తే గనుక దసరా కేబినెట్ మార్పులలో ఈ పోర్ట్‌ ఫోలియో మార్పు సాధ్యం కావచ్చు.

Also Read : కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ మందులపై తక్షణ నిషేధం..!

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ హోం మంత్రి పదవిని తీసుకుంటారని అభిమానులు, జనసేన శ్రేణులు ఆశించారు. కానీ ఆయన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు పవన్ స్వయంగా హోం శాఖ ప్రస్తావన తీసుకురావడంతో, దసరా తర్వాత జరిగే కేబినెట్ మార్పులలో ఆయన ఖచ్చితంగా హోం మంత్రి అవుతారని జనసైనికులు బలంగా నమ్ముతున్నారు. అయితే, ఇది కేవలం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల పుట్టుకొచ్చిన ప్రచారమా లేక నిజంగానే కూటమి ప్రభుత్వంలో అంతర్గతంగా జరుగుతున్న వ్యూహాత్మక చర్చలా అనేది తెలియాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది....

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

పోల్స్