Sunday, June 21, 2026 11:06 AM
Sunday, June 21, 2026 11:06 AM

కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ మందులపై తక్షణ నిషేధం..!

ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడమే ధ్యేయంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వైద్యపరంగా ఎలాంటి సరైన కారణాలు లేని, రోగుల ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్న 16 రకాల స్థిర-మోతాదు కలయిక మందుల ఉత్పత్తి, విక్రయాలు మరియు పంపిణీని కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిషేధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.

Also Read : సాయికృష్ణ వ్యవహారంలో వైసీపీకి ఒరిగిందేమిటి?

ఈ నిషేధిత జాబితాలో ప్రజలు సాధారణంగా ఉపయోగించే పలు రకాల పెయిన్ కిల్లర్స్, కండరాల నొప్పుల మందులు మరియు యాంటీబయాటిక్స్ కాంబినేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా డైసైక్లోమైన్, పారాసిటమాల్ కలయికతో కూడిన కొన్ని మందులు, అలాగే అమోక్సిసిలిన్, సెర్రాటియోపెప్టిడేస్ వంటి యాంటీబయాటిక్ కలయికలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఇటువంటి మందుల వల్ల కలిగే ప్రయోజనాల కంటే వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయని శాస్త్రీయ సమీక్షలో తేలింది.

Also Read : బిజేపిలో ఏం జరుగుతోంది..? రాజనాథ్ ఇంట్లో కీలక భేటీ..!

కేవలం టాబ్లెట్లు మాత్రమే కాకుండా, చర్మ సంరక్షణకు ఉపయోగించే కొన్ని రకాల డెర్మటోలాజికల్ లోషన్లు, క్రీములపై కూడా కేంద్రం నిషేధం విధించింది. అలోవెరా, విటమిన్-ఇ, జోజోబా ఆయిల్, ఆరెంజ్ ఆయిల్ మరియు టీ ట్రీ ఆయిల్ వంటి వాటితో కలిపి తయారుచేసే కొన్ని చర్మ సౌందర్య ఉత్పత్తుల ఫార్ములేషన్లు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటి వినియోగం వల్ల ఎటువంటి అదనపు వైద్య ప్రయోజనాలు లేవని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 లోని సెక్షన్ 26ఏ కింద ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనలను దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, నిఘా విభాగాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఔషధాల హేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి మరియు రోగుల భద్రతను నిర్ధారించడానికి భవిష్యత్తులో కూడా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన డ్రగ్ కాంబినేషన్ ఇదే..

  1. Amoxicillin + Serratiopeptidase + Lactobacillus Sporogenes
  2. Amoxicillin + Serratiopeptidase
  3. Amoxicillin + Cloxacillin + Lactic Acid Bacillus + Serratiopeptidase
  4. Cefuroxime + Serratiopeptidase
  5. Cefadroxyl + Probenecid
  6. Dicyclomine + Paracetamol + Clidinium Bromide + Chlordiazepoxide
  7. Dicyclomine + Paracetamol + Clidinium Bromide
  8. Aloe Extract + Allantoin + Alphatocopherol Acetate + D-Panthenol + Vitamin A
  9. Aloe Extract + Vitamin E + Dimethicone + Glycerine
  10. Aloe Vera + Jojoba Oil + Vitamin E
  11. Aloe vera + Orange oil
  12. Aloe vera + Vitamin E + Herbal
  13. Paracetamol + Lignocaine
  14. Gliclazide + Chromium Picolinate

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్