Monday, September 21, 2026 07:47 PM
Monday, September 21, 2026 07:47 PM

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆఫీసు దగ్గర వైసీపీ మూక చేసిన రౌడీయిజంపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పోర్ట్స్ కోటా DSC 2025 ద్వారా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు, రౌడీ షీటర్లు భౌతిక దాడులకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సమాజంలో పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడులు చేయించడం వైఎస్ జగన్ నేర మనస్తత్వానికి, ఫ్యాక్షన్ రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.

Also Read : ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు..?

అత్యుత్తమ ఆటతీరుతో రాష్ట్రం, దేశం కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన క్రీడాకారులను గౌరవించాల్సింది పోయి, వారిపై ఫేక్ ఆరోపణలు చేయడం జగన్ దుర్బుద్ధికి నిదర్శనమని లోకేష్ విమర్శించారు. గత వైసీపీ హయాంలో దైవంతో సమానమైన ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద కాపలాదారులుగా నిలబెట్టిన చరిత్ర వారిదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం క్రీడల్లో ప్రతిభ చూపిన యువతకు అర్హత మేరకు గౌరవప్రదమైన టీచర్ ఉద్యోగాలు కల్పిస్తే, దానిని తట్టుకోలేక వైసీపీ తప్పుడు నిందలతో రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పోర్ట్స్ కోటా DSC టీచర్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై అధికారులకు వివరణ ఇచ్చేందుకు వచ్చిన అభ్యర్థులపై వైసీపీ ప్రేరేపిత మూకలు రాక్షసంగా విరుచుకుపడ్డాయని లోకేష్ ఆరోపించారు. ఆందోళనల పేరుతో రౌడీ షీటర్లను, గంజాయి-బ్లేడ్ బ్యాచులను ఉపాధ్యాయులపైకి ఉసిగొల్పి దాడులు చేయించారని ధ్వజమెత్తారు. దేశ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులపై దాడులు చేసి, భయాందోళనలకు గురిచేయడం క్షమించరాని నేరమన్నారు.

Also Read : ఎర్రవల్లిలో ఊపందుకున్న భూముల సర్వే..!

గురువులపై దాడులకు తెగబడిన క్రిమినల్ గ్యాంగులను, రౌడీ షీటర్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, బాధ్యులందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల జోలికి వస్తే సహించేది లేదని వైసీపీకి స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రౌడీయిజం చేయాలని చూస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, గంజాయి-బ్లేడ్ బ్యాచుల పనిపడతామని తేల్చిచెప్పారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో...

హైదరాబాద్‌లోని కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి...

వైసీపీ నేతలపై క్రిమినల్...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ...

ఎర్రవల్లిలో ఊపందుకున్న భూముల...

మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్...

నాతో వస్తావా.. నీకు...

అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో వ్యాపారం చేయాలనుకున్న...

టీవీ9లోకి మళ్ళీ ఎంట్రీ...

తెలుగు మీడియా రంగంలో అత్యంత ప్రజాదరణ...

SAAP ఆఫీస్ వద్ద...

విజయవాడ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు...

పోల్స్