Monday, June 22, 2026 06:41 PM
Monday, June 22, 2026 06:41 PM

హైస్పీడ్‌గా రైలు నెట్‌వర్క్..!

హైస్పీడ్ ట్రైన్ కలలను నిజం చేస్తూ.. దేశవ్యాప్త రైల్వే నెట్ వర్క్ ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ కొత్తగా ఏడు బుల్లెట్ రైలు కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మెగా ప్రాజెక్టుల వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైలు మార్గాలు అందుబాటులోకి వస్తే.. దేశంలోని ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, టెక్నాలజీ, టూరిజం హబ్‌ల మధ్య ప్రయాణ సమయం ఊహించని విధంగా గణనీయంగా తగ్గిపోనుంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది.

Also Read : రూపాయి పతనం.. వీసా కష్టాలు.. విదేశీ విద్య ఇంత దారుణమా..?

ఐటీ హబ్‌లుగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటల 10 నిమిషాలకు, పుణె – హైదరాబాద్ మధ్య సమయాన్ని 2 గంటల 8 నిమిషాలకు తగ్గించేలా కారిడార్లను ఖరారు చేశారు. వీటితో పాటు ముంబై – అహ్మదాబాద్ 1 గంట 57 నిమిషాలు, ముంబై – పుణె 48 నిమిషాలు, బెంగళూరు – చెన్నై 73 నిమిషాలు, ఢిల్లీ – లక్నో మధ్య 2 గంటలు, ఢిల్లీ – వారణాసి 3 గంటల 15 నిమిషాలు, ఢిల్లీ – సిలిగురి 6 గంటలు.. ఈ మార్గాలను కేంద్రం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయని, సమగ్ర అధ్యయనం, భూసేకరణ, అనుమతులు, నిధుల కేటాయింపులు పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు.

Also Read : సాయి కృష్ణ కేసులో నేడు సంచలనాలు..!

మరోవైపు.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జపాన్ సాంకేతిక, ఆర్థిక సహాయంతో షింకన్సెన్ వ్యవస్థ ఆధారంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై – అహ్మదాబాద్ కారిడార్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ సెక్షన్ సేవలను వచ్చే ఏడాది నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ శ్రమిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనితో పాటు ఢిల్లీ – వారణాసి – పాట్నా బుల్లెట్ రైలు కారిడార్‌‌కు కూడా ఆమోదం లభించిందని ఇది పూర్తయితే పాట్నా నుండి ఢిల్లీకి కేవలం 4 గంటల 41 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు. భవిష్యత్తులో ఈ లైన్‌ను సిలిగురి వరకు పొడిగిస్తామని వివరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.....

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు....

సాయి విషయంలో డ్యూయల్...

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక...

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

సాయి కృష్ణ కేసులో...

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో...

పవన్ కు ఆ...

ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్...

పోల్స్