Sunday, August 16, 2026 02:38 AM
Sunday, August 16, 2026 02:38 AM

వెస్పా లిమిటెడ్ వెర్షన్ కేక.. అదిరిపోయే ఫీచర్లు..!

ప్రముఖ టూ-వీలర్ బ్రాండ్ వెస్పా.. తన 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఎడిజియోన్ ఒట్టాంటెసిమో పేరుతో విడుదలైన ఈ మోడల్‌ ను రోమ్ నగరంలో జరిగిన ప్రత్యేక వేడుకల్లో ప్రదర్శించారు. వెస్పా సంస్థ మొదటిసారి ప్రొడక్షన్ ప్రారంభించిన సంవత్సరానికి గుర్తుగా కేవలం 1,946 యూనిట్లను మాత్రమే పరిమిత సంఖ్యలో తయారు చేయనున్నారు. వెస్పా జిటిఎస్ 310 మోడల్ ఆధారంగా ఈ 80వ వార్షికోత్సవ ప్రత్యేక స్కూటర్‌ను డిజైన్ చేశారు.

Also Read : వాట్సాప్ లో ఫోన్ నంబర్ పని లేదా..?

సాధారణంగా వెస్పా స్కూటర్లు రంగురంగుల కలర్స్‌ లో ఉంటాయి. కానీ ఈ స్పెషల్ ఎడిషన్‌ కు పాతకాలపు హెరిటేజ్ లుక్ ఇచ్చేందుకు రా స్టీల్ ఫినిషింగ్‌ను ఉపయోగించారు. దీని సీటు, వీల్ రిమ్స్, సైడ్ గ్రాఫిక్స్‌పై గ్రీన్ కలర్ యాక్సెంట్స్ ఇచ్చారు. సీటు కింద ఉండే ఒక ప్రత్యేకమైన నంబర్ ప్లేట్.. ఇది లిమిటెడ్ ఎడిషన్ అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ స్కూటర్ క్లాసిక్ లుక్‌ లో ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా ఎక్కడా తగ్గలేదు. ఇందులో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, 5-ఇంచుల టీఎఫ్‌టీ కలర్ డిస్ప్లే, మరియు స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ కోసం వెస్పా ఎంఐఏ సిస్టమ్‌ ను అమర్చారు.

Also Read : సునీల్ కుమార్ రిటైర్మెంట్ వేడుకలు.. పొలిటికల్ ఎంట్రీపై రేపే ప్రకటన..?

వీటితో పాటు కీ లెస్ ఇగ్నిషన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ఏఎస్ఆర్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో స్టాండర్డ్‌ గా వస్తున్నాయి. ఈ స్కూటర్ కొనుగోలు చేసే వారికి ఇదే థీమ్‌ తో కూడిన ఒక హెల్మెట్ ఉచితంగా లభిస్తుంది. మెకానికల్ పరంగా చూస్తే, ఇందులో 310సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 25 హెచ్‌పీ పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. వెస్పా కంపెనీ చరిత్రలోనే ఇప్పటివరకు విడుదలైన స్కూటర్లలో ఇదే అత్యంత పవర్‌ ఫుల్ ప్రొడక్షన్ స్కూటర్ కావడం విశేషం. ఈ స్కూటర్ కొనే వినియోగదారులకు వెస్పా 80 ఏళ్ల ప్రయాణానికి సంబంధించిన అరుదైన ఫోటోలు, డాక్యుమెంట్లతో కూడిన ఒక ప్రీమియం హార్డ్‌ కవర్ పుస్తకాన్ని కూడా గిఫ్ట్‌గా ఇస్తున్నారు. వింటేజ్ మరియు కలెక్టర్స్ ఐటెమ్స్‌ ను ఇష్టపడే వారికి ఈ స్కూటర్ ఒక బెస్ట్ ఛాయిస్ కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

STREE SHAKTI: WOMEN’S...

AMARAVATI*: To mark Stree Sakti...

బంగ్లాదేశ్‌ ను భారత్...

భారతదేశం నుండి అదనంగా డీజిల్ సరఫరా...

తొలిరోజే 31 విమానాలు.....

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం...

జోగి సీటు చిరిగినట్లేనా.....

జోగి రమేష్.. ఈ పేరు పెద్దగా...

మళ్లీ కొత్త పాట...

ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.....

ఏపీలో మద్యం ధరలు...

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రిటైల్ ఎక్సైజ్ విధానం...

పోల్స్