Saturday, August 15, 2026 09:15 PM
Saturday, August 15, 2026 09:15 PM

ఏపీ పెట్రోల్ బంకులపై సర్కార్ స్పెషల్ ఫోకస్..!

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో అవినీతిని అంతమొందించేందుకు, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు 12 మంది ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేక విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రత్యేక విజిలెన్స్ బృందం ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జరిగే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై నిరంతర నిఘా ఉంచనుంది.

Also Read : ఎమ్మెల్యేలు.. వారితో తస్మాత్ జాగ్రత్త..!

రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడటంతో పాటు, కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. మిల్లింగ్ ప్రక్రియలో జరిగే అవకతవకలను అడ్డుకోవడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ప్రజలకు అందే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ 12 మంది అధికారుల బృందం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులు, పీడీఎస్ స్టాక్ పాయింట్లలో ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించవచ్చు.

వీటితో పాటు వినియోగదారులను మోసం చేసే ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు, కల్తీ మరియు తక్కువ కొలతలతో విక్రయించే పెట్రోల్ బంకులపైనా ఈ బృందం ఉక్కుపాదం మోపనుంది. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లో ఎలాంటి లూప్‌ హోల్స్ లేకుండా ఈ కమిటీ చూస్తుంది. అలాగే చిన్నపిల్లలు, విద్యార్థులకు అందే పౌష్టికాహారంలో అవినీతి జరగకుండా అంగన్‌ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ హాస్టళ్లు మరియు పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపైనా విజిలెన్స్ బృందం ప్రత్యేక నిఘా ఉంచనుంది.

Also Read : ఇప్పటికీ జగన్ నామస్మరణే..?

క్షేత్రస్థాయిలో జరిపే ఈ తనిఖీల్లో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘనలు లేదా అక్రమాలు వెలుగుచూస్తే, ఈ విజిలెన్స్ బృందం తక్షణమే నివేదికలను సిద్ధం చేసి ఏపీ ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ నివేదికల ఆధారంగా అక్రమార్కులు, అవినీతి అధికారులపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సామాన్య ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

STREE SHAKTI: WOMEN’S...

AMARAVATI*: To mark Stree Sakti...

బంగ్లాదేశ్‌ ను భారత్...

భారతదేశం నుండి అదనంగా డీజిల్ సరఫరా...

తొలిరోజే 31 విమానాలు.....

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం...

జోగి సీటు చిరిగినట్లేనా.....

జోగి రమేష్.. ఈ పేరు పెద్దగా...

మళ్లీ కొత్త పాట...

ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.....

ఏపీలో మద్యం ధరలు...

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రిటైల్ ఎక్సైజ్ విధానం...

పోల్స్