Tuesday, June 30, 2026 02:57 PM
Tuesday, June 30, 2026 02:57 PM

ఇప్పటికీ జగన్ నామస్మరణే..?

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఇంకా మూడేళ్ల పదవీకాలం మిగిలి ఉంది. ఏ ప్రభుత్వమైనా నిలబడేది ప్రతిపక్షాన్ని తిట్టడం వల్ల కాదు.. ప్రజలకు అందించే పాలన వల్లే. పరిపాలన బాగుంటే ప్రజలు మరో అవకాశం ఇస్తారు. లేదంటే ఎంత పెద్ద నాయకుడినైనా పక్కన పెడతారు. ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో రుజువైంది కూడా. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు సహజం. తమ పాలన, ప్రత్యర్థుల పాలన మధ్య తేడాను ప్రజలకు వివరించడం రాజకీయ పార్టీల బాధ్యతే. కానీ ఎన్నికలు ముగిసి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ “జగన్ మళ్లీ వస్తే…” అనే హెచ్చరికలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాల్లో ప్రధాన అంశంగా మారడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

Also read : మల్టీ స్టారర్ లపై స్టార్ హీరో సంచలన కామెంట్స్..!

సభ ఏదైనా.. సందర్భం ఏదైనా.. వైసీపీ, జగన్‌పై విమర్శలు లేకుండా ముఖ్యమంత్రి ప్రసంగం ముగియడం అరుదుగా మారింది. “వైసీపీ వస్తే అభివృద్ధి ఆగిపోతుంది”, “రాష్ట్రం మళ్లీ వైకుంఠపాళి అవుతుంది” అంటూ ప్రజలను హెచ్చరించడం చూస్తుంటే, ఇది పాలనా సమీక్ష కంటే ఎన్నికల ప్రచారంలా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రత్యర్థులను తిట్టమని కాదు.. మంచి పాలన అందించమని. రెండేళ్ల తర్వాత కూడా ప్రభుత్వం తన పనితీరు కంటే ప్రత్యర్థి పేరునే ఎక్కువగా ప్రస్తావించాల్సి వస్తే, అది ప్రభుత్వ ఆత్మవిశ్వాసంపై సందేహాలకు దారితీస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలు, ఇతర సంస్థల నివేదికల్లో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైందనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండేళ్లకే ప్రభుత్వంపై ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం ఆందోళనకరమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.

క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల వ్యవహారశైలే ఈ అసంతృప్తికి ప్రధాన కారణమనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ జోక్యం పెరగడం, అధికారులు స్వేచ్ఛగా పని చేయలేకపోవడం, గ్రామ స్థాయి నాయకుల వరకు అధికార దుర్వినియోగం పెరగడం, సచివాలయాల్లో సైతం ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సహజ వనరుల దోపిడీ, అధికార అహంకారం కూడా ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్న అంశాలుగా చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి రాకపోవడం సాధ్యం కాదు. అప్పుడప్పుడు కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. ఒకవైపు సొంత నాయకుల వ్యవహారశైలిపై చర్యలు తీసుకోకుండా, మరోవైపు ప్రజలు ప్రతిపక్షం వైపు చూడొద్దని కోరడం సహజంగానే ప్రశ్నలకు దారితీస్తోంది. ప్రజలు ప్రత్యర్థి వైపు ఎందుకు చూస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం వెతకకుండా.. వారిని భయపెట్టే ప్రయత్నం చేయడం రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుందో కాలమే చెప్పాలి.

Also read : కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్‌ లు..!

వైసీపీని ఎంతగా విమర్శించినా, “గొడ్డలి పార్టీ” వంటి వ్యాఖ్యలు చేసినా.. చివరికి ప్రజలు చూసేది ఒక్కటే.. పాలన! తమ జీవితాల్లో మార్పు కనిపిస్తేనే ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. విమర్శలు కాదు, పరిపాలనే ప్రజాభిప్రాయాన్ని నిర్ణయిస్తుంది. మంచి పాలన ఉంటే ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నా ప్రజలు మళ్లీ అధికారాన్ని అప్పగిస్తారు. పాలన బలహీనంగా ఉంటే, ప్రత్యర్థిని ఎంతగా భయపెట్టినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రజలను భయపెట్టడం కంటే వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం ముఖ్యం. ఆ విశ్వాసాన్ని తీసుకువచ్చేది ప్రసంగాలు కాదు.. పరిపాలన మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

2018 గ్రూప్ వన్...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పులకు...

పవన్ కు సర్జరీ...

ఇటీవలే సర్జరీ చేయించుకుని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న.....

సునీల్ కుమార్ కేసు.....

అధికారి పీవీ సునీల్ కుమార్ తన...

డిజిటల్ ఏపీ.. రాకెట్...

ఏపీని డిజిటల్ రంగంలో నంబర్ వన్‌గా...

కాషాయ పార్టీ స్పెషల్...

దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది....

వైసీపీ నేతలను తరిమి...

అమరావతి... ఇది కేవలం ఒక ప్రాంతం...

పోల్స్