Sunday, August 16, 2026 03:49 AM
Sunday, August 16, 2026 03:49 AM

పవన్ కు సర్జరీ తప్పదు.. షాక్ ఇచ్చిన వైద్యులు..!

ఇటీవలే సర్జరీ చేయించుకుని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరో సమస్య ఎదురైంది. నిన్న వైద్య పరీక్షల నిమిత్తం తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య బృందం క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించింది. గత కొంతకాలంగా భుజాల నొప్పితో బాధపడుతున్న ఆయనకు, అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

Also Read : మల్టీ స్టారర్ లపై స్టార్ హీరో సంచలన కామెంట్స్..!

వైద్య పరీక్షల అనంతరం పవన్ కల్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ సమస్యతో పాటు, రెండు భుజాలకు సంబంధించిన కండరాలు తీవ్రంగా చిట్లిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. భుజం కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు తక్షణమే శస్త్రచికిత్స అవసరమని, సర్జరీతో పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని అంబానీ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. వైద్యులు వెంటనే సర్జరీ చేసుకోవాలని సూచించినప్పటికీ, పవన్ కల్యాణ్ తన బాధ్యతలకు ప్రాధాన్యతనిచ్చారు.

Also Read : సునీల్ కుమార్ కేసు.. రంగంలోకి ఏజీ..?

ప్రస్తుతం అమరావతిలో ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉన్నందున, వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసిన తర్వాతే తాను శస్త్రచికిత్స చేయించుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ అధికారిక కార్యక్రమాల అనంతరం ఆయన సర్జరీ డేట్ ఖరారు కానుంది. కాగా పవన్ కల్యాణ్ గత కొన్ని నెలలుగా, ముఖ్యంగా గత ఎన్నికల ప్రచార సమయం నుండి ఈ భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవలే హైదరాబాద్‌ లో సైనస్ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

STREE SHAKTI: WOMEN’S...

AMARAVATI*: To mark Stree Sakti...

బంగ్లాదేశ్‌ ను భారత్...

భారతదేశం నుండి అదనంగా డీజిల్ సరఫరా...

తొలిరోజే 31 విమానాలు.....

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం...

జోగి సీటు చిరిగినట్లేనా.....

జోగి రమేష్.. ఈ పేరు పెద్దగా...

మళ్లీ కొత్త పాట...

ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.....

ఏపీలో మద్యం ధరలు...

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రిటైల్ ఎక్సైజ్ విధానం...

పోల్స్