Saturday, October 3, 2026 06:11 PM
Saturday, October 3, 2026 06:11 PM

మద్యం స్కామ్‌లో మరో సంచలనం.. చిరుద్యోగుల జీతాలు కూడా వదల్లేదా..?

గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే చిరుద్యోగుల జీతాలను సైతం వదలకుండా ఏకంగా రూ.400 కోట్లు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. మద్యం రవాణాకు సంబంధించిన స్కామ్స్ ఒకవైపు విచారణలో ఉండగానే.. ఇప్పుడు దారిద్ర్య రేఖకు దిగువన ఉండి రెక్కాడితే గాని డొక్కాడని చిరుద్యోగుల పొట్టకొట్టి వందల కోట్లు కొల్లగొట్టారనే ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read : టీటీడీ చైర్మన్‌గా మరో నాయుడు..?

ఈ భారీ అవినీతి దందాలో వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ డి. వాసుదేవ రెడ్డిలకు భారీగా లబ్ధి చేకూరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల నిర్వహణ కోసం 9 వేల మంది సిబ్బందిని మాత్రమే నియమించుకోవడానికి అనుమతి ఉండగా, ఏకంగా 11 వేల నుంచి 12 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు చూపించి అదనంగా జీతాలు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

రికార్డుల ప్రకారం ఒక్కో ఉద్యోగికి రూ.20 వేల నుండి రూ.25 వేల చొప్పున జీతాలు ఇస్తున్నట్లు ప్రభుత్వ సొమ్మును డ్రా చేసి, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి మాత్రం కేవలం రూ.13 వేల నుండి రూ.16 వేలు మాత్రమే చెల్లించినట్లు తేలింది. ఇలా ఒక్కో ఉద్యోగి జీతం నుండి నెలకు రూ.8 వేల వరకు నొక్కేస్తూ.. ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.400 కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్కామ్ ద్వారా దోచుకున్న సొమ్ములో సింహభాగం ఎంపీ మిథున్ రెడ్డి, వాసుదేవ రెడ్డిల ఖాతాల్లోకే చేరినట్లు సమాచారం.

Also Read : ఈడీ స్పీడ్ ను ఆపేవారు ఎక్కడ..? తాడేపల్లిలో టెన్షన్ టెన్షన్..!

ఈ దందా మొత్తం రాయచోటికి చెందిన రెడ్డి అండ్ రెడ్డి పేరుతో పెద్దిరెడ్డి అనుచరుడి ద్వారా నడిపిన ఒక భారీ ముఠాగా తేలింది. కేవలం జీతాల దోపిడీ మాత్రమే కాకుండా.. ఉద్యోగులకు సంబంధించిన ఈఎస్‌ఐ, పీఎఫ్, ప్రభుత్వానికి కట్టాల్సిన జీఎస్‌టీ నిధులు కలిపి మరో రూ.100 కోట్లకు పైగా ఎగవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రంగంలోకి దిగిన సిట్ అధికారులు.. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లతో పాటు కీలకమైన డిజిటల్ ఆధారాలను ఈ ముఠా ముందే ధ్వంసం చేసినట్లు గుర్తించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

జగన్‌ చేతిలో 40...

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు...

నాడు ISB, నల్సార్.....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో...

రచ్చ చేస్తున్న ఫామ్‌హౌస్...

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఫామ్ హౌస్...

ఈడీ స్పీడ్ ను...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి...

డిసెంబర్‌కు వాయిదా పడనున్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ,...

పోల్స్