Tuesday, September 29, 2026 09:17 PM
Tuesday, September 29, 2026 09:17 PM

ఒక్క మ్యాచ్ తో కోహ్లీ రేర్ రికార్డులు..!

వయసుతో సంబంధం లేకుండా భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన రికార్డుల వేటను దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్‌తో తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ విధ్వంసకర శతకంతో చెలరేగి వన్డే కెరీర్‌లో 55వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 88 బంతుల్లోనే 10 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 139 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా, టీమిండియాకు 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించాడు.

Also Read : రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు

ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌ల పేరిట ఉన్న పలు ఆల్‌టైమ్ రికార్డులను కోహ్లీ తిరగరాశాడు. వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఘనతలో కోహ్లీ.. 74 మ్యాచ్‌ల్లో 13 సెంచరీల.. లిజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ 38 మ్యాచ్‌ల్లో 13 సెంచరీల రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 15,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించి, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

Also Read : మరింత శక్తిమంతంగా మారనున్న ఎల్‌నినో..?

అంతేకాకుండా, భారత గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా (7,006 పరుగులు) నిలిచి, ఇక్కడ కూడా సచిన్ (6,976 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో ఒకే వేదికపై అవుట్ కాకుండా అత్యధిక పరుగులు (338 పరుగులు) చేసిన విలక్షణ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం లిస్ట్-ఎ క్రికెట్‌లో 59 సెంచరీలతో సచిన్ టెండూల్కర్‌తో కలిసి కోహ్లీ సమానంగా ఉన్నారు. భారత్ ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని కేవలం 41.4 ఓవర్లలోనే చేధించింది. కోహ్లీతో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అద్భుత సెంచరీతో రాణించడంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ టూ జనసేన.....

వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది....

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు...

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫార్ములా-ఈ రేసు...

రకుల్ ప్రీత్ సింగ్...

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో...

అల్లు శిరీష్: ఒక్క...

హైదరాబాద్‌లోని వినోబా నగర్‌ హనుమాన్ ఆలయం...

పెద్దల సభకు రాజకీయ...

తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి...

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

పోల్స్