భారత ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు, సాఫ్ట్వేర్ లోపాల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఇబ్బందులు ముదురుతున్నాయి. ఓటర్ల రికార్డుల సవరణలో స్థానిక ఎన్నికల అధికారులకు మరిన్ని అధికారాలు, పారదర్శకత కల్పించాలంటూ మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్. చొక్కలింగం కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన సంచలన లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read : ఒక్క మ్యాచ్ తో కోహ్లీ రేర్ రికార్డులు..!
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఓటర్ల జాబితాల నిర్వహణ కోసం ప్రవేశపెట్టిన కేంద్రీకృత డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ‘ECINET ECINet’ సాఫ్ట్వేర్ పనితీరుపై చొక్కలింగం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సాఫ్ట్వేర్ వల్ల స్థానిక ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారుల చట్టబద్ధమైన అధికారాలకు ఆటంకం కలుగుతోందని, దీనిలో తక్షణమే 5 కీలక మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా గిరిజనులు, ఇళ్లు లేని నిరుపేదలు, లైంగిక కార్మికుల వద్ద సరైన గుర్తింపు పత్రాలు ఉండవని, ప్రస్తుత నిబంధనల వల్ల వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని లేఖలో హెచ్చరించారు.
Also Read : మరింత శక్తిమంతంగా మారనున్న ఎల్‌నినో..?
మహారాష్ట్ర సీఈఓ లేఖ కంటే ముందే, కేంద్ర ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు కూడా ఈ ‘SIR’ ఓటర్ల సవరణ ప్రక్రియపై మరియు ఈసీఐనెట్ డేటా కేంద్రీకరణపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. గత 10 నెలల్లో వీరు దాదాపు 14 సార్లు అధికారికంగా తమ అసమ్మతిని వ్యక్తం చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాల నుండి దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించటం, అందులో మహారాష్ట్రలోనే అత్యధికంగా 21.1 శాతం మంది ఓట్లు గల్లంతు కావడం రాజకీయ దుమారానికి దారితీసింది.

