Tuesday, September 29, 2026 08:01 PM
Tuesday, September 29, 2026 08:01 PM

వైసీపీ టూ జనసేన.. ఎవరికి లాభం..?

వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. చాలా చోట్ల ఎక్కువ మంది నేతలు ఉన్నారు. వారంతా నియోజకవర్గం స్థాయి నాయకులే. వారిని అలా ప్రోత్సహించిన అధినాయకత్వం మరో సమయంలో వారి స్థానంలో కొత్త వారిని తీసుకుని రావడంతో వారంతా పక్కకు పోయారు. అయినా సరే.. తమకంటూ ఉన్న వర్గంతో పార్టీలో పోరుకు కారణం అపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ పోరు వల్ల వైసీపీకి జరగాల్సిన రాజకీయ నష్టం బాగానే జరిగింది. వై నాట్ 175 అని చెప్పిన జగన్‌కు చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇందుకు పార్టీలో నేతల మధ్య అంతర్గత పోరు ప్రధాన కారణమని అప్పట్లో విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు కూడా.

Also Read : జగన్ ఎవరి చేతిలో కీలు బొమ్మ..?

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ అసంతృప్తులకు మరో అవకాశం పచ్చినట్లు ఉంది. అందుకే వైసీపీని వీడిపోతున్నారు. వీరంతా ఇప్పుడు జనసేన పార్టీని బెస్ట్ ఆప్షన్‌గా చూసుకుంటున్నారు. ఏపీలో రెండే పార్టీల వ్యవస్థ ఉంది. ప్రత్యామ్నాయంగా జనసేన మూడవ పార్టీగా ఎదగాలని మొదటి నుంచి అనుకుంటోంది. ఈ నేపధ్యంలో విపక్షంలో ఉన్న వైసీపీనే తొలి నుంచి జనసేన టార్గెట్ చేసింది. అధికారంలో ఉండగానే పార్టీని పటిష్టం చేసుకోవాలని జనసేన పార్టీ అధినేత చూస్తున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కూడా జనసేన భావిస్తోంది. అంది వచ్చిన అవకాశాలను సొమ్ము చేసుకునేందుకు జనసేన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో వైసీసీ నేతలు చాలా చోట్ల ఫ్యాన్ స్విచ్ఛ్ ఆపేసి గాజు గ్లాసు పట్టుకుంటున్నారు.

వైసీపీలో వర్గ పోరు గట్టిగా ఉన్న చోట్ల ఇమడలేని నేతలు అంతా జనసేన గూటికి చేరిపోతున్నారు. దీంతో వైసీపీ టూ జనసేన పొలిటికల్ షిఫ్టింగ్ ఎవరికి లాభం అనే చర్చ ముందుకు వస్తోంది. వైసీపీలో ఉన్నా కూడా వర్గ పోరుతో నష్టం చేస్తూ వస్తున్న నాయకులను ఆ పార్టీ కలిపి ఉంచలేకపోతోంది. నిన్నటి వరకు తాము ఇంచార్జిగా ఉన్న స్థానంలో కొత్త వారు వస్తే సహకరించడం కష్టం అనేది ఈ నేతల భావన. అలా ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడ్చే విషయంలో అధినాయకత్వంే ఘోరంగా విఫలమవుతోంది. దాంతో ఈ నేతలు పార్టీని వీడుతున్నారు. దీని వల్ల వైసీపీకి రాజకీయ నష్టమా లేక లాభమా అంటే తాత్కాలికంగా సష్టమే అని అంటున్నారు. ఎందుకంటే పార్టీ విడిచి పెట్టిన వారి ప్రభావం తప్పకుండా ఉంటుందంటున్నారు.

అయితే పార్టీలో ఉంటూ చేసే నష్టం కంటే ప్రత్యర్థిగా ఉంటేనే ఉత్తమం అనే భావన వైసీపీ నేతల్లో కూడా ఉంది. దాని వల్ల పార్టీలో ఎలాంటి గందరగోళం లేకుండా అంతా ఏకతాటిపైకి వస్తారని భావిస్తున్నారు. ఇక వారి వెంట వెళ్ళే నేతలు ఎవరైనా ఉంటే సార్వత్రిక ఎన్నికల నాటికి బలం తిరిగి సంపాదించుకోవడానికి పార్టీకి చాలా సమయం ఉంటుందని కూడ విశ్లేషిస్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు అక్కడ మొదటి స్థానమే దక్కుతుంది. ఎందుకంటే జనసేనలో వారికి అంతగా పోటీ ఉండదు, అయితే కూటమిలో టీడీపీ కూడా ఉంది. నిన్నటి వరకు టీడీపీకి ఎదురు నిలిచి పోరాడి ఇప్పుడు మిత్రులుగా వచ్చినా.. ఆ పార్టీ నేతల నుంచి అనుకున్న సహకారం ఉండకపోవచ్చు. దాంతో కూటమిలో ఇమడడం మరో సవాల్‌గా ఉంటుంది.

Also Read : బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఎఫ్‌డీ రూల్స్ మారుతున్నాయా..? 

అయితే జనసేన సొంతంగా బలపడాలి అనుకుంటే వలస నేతలే కీలకం అంటున్నారు. అందువల్ల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే ఈ చేరికలను జనసేన ప్రోత్సహిస్తోందనే మాట బాగా వినిపిస్తోంది. అప్పుడు ఏపీ రాజకీయాల్లో మూడవ ఫోర్‌ గా జనసేన కూడా గట్టిగా నిలబడుతుందని అంటున్నారు. అయితే వైసీపీ నేతలను కానీ ఇతర పార్టీల నాయకులను కానీ తెచ్చి పార్టీని బలోపేతం చేసుకోవడం కంటే సొంతంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కొత్త నేతలను తయారు చేసుకోవడమే జనసేనకు మంచిదనే సలహా సూచనలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా రాజకీయాల్లో ఫలితాలు కావాలి కాబట్టి ఇప్పటికి ఇదే కరెక్ట్ అన్నది కూడా ఉంది. ఇక జనసేన ఎంత బలపడితే అంత టీడీపీకే ఇబ్బంది. అన్న చర్చ కూడా ఉంది. మరి ఈ జంపింగులతో కూటమి బలంగా మారుతుందా లేక అసంతృప్తులు ఇబ్బందులు వచ్చి వైసీపీకి మేలు చేస్తుందా అంటే 2029 ఎన్నికలే సరైన జవాబు చెప్పాల్సి ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు...

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫార్ములా-ఈ రేసు...

రకుల్ ప్రీత్ సింగ్...

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో...

అల్లు శిరీష్: ఒక్క...

హైదరాబాద్‌లోని వినోబా నగర్‌ హనుమాన్ ఆలయం...

పెద్దల సభకు రాజకీయ...

తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి...

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ...

పోల్స్