Tuesday, September 29, 2026 08:01 PM
Tuesday, September 29, 2026 08:01 PM

ప్రపంచ దేశాలకు జైశంకర్ వార్నింగ్.. అమెరికా తీరుపై భారత్ తీవ్ర అసంతృప్తి..!

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. న్యూయార్క్‌లో జరిగిన ఆసియా సొసైటీ సదస్సులో ఆయన మాట్లాడుతూ, యుద్ధాల కారణంగా గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని ఆహారం, ఇంధనం, ఎరువులు మరియు ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : కూచిపూడి రంగప్రవేశంతో ఆకట్టుకున్న ఖ్యాతి పుట్టా

ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఎరువుల కొరత ఏర్పడిందని, నల్లసముద్రం గుండా సాగాల్సిన ఆహార ధాన్యాల రవాణాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై మరింత భారాన్ని మోపుతాయని, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు కృత్రిమంగా పెరగడం వల్ల దేశాల ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ దౌత్యం అనేది ఒక ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్ లాగా మారిపోయిందని ఆయన అభివర్ణించారు.

Also Read : బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఎఫ్‌డీ రూల్స్ మారుతున్నాయా..? 

ఇదే వేదికపై భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుతూ.. భారతదేశ భద్రతా ప్రాధాన్యతలను గుర్తించడంలో వాషింగ్టన్ ప్రదర్శిస్తున్న ఉదాసీనతను జైశంకర్ తప్పుపట్టారు. పాకిస్థాన్ స్పాన్సర్ చేస్తున్న సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ వ్యక్తపరుస్తున్న ఆందోళనల పట్ల అమెరికాకు కనీస సానుభూతి లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసారు. వాణిజ్యపరమైన ఇబ్బందులతో పాటు ఉగ్రవాద నియంత్రణ విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న శైలి ఇరుదేశాల మధ్య ప్రధాన సవాలుగా మారిందని జైశంకర్ స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ టూ జనసేన.....

వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది....

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు...

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫార్ములా-ఈ రేసు...

రకుల్ ప్రీత్ సింగ్...

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో...

అల్లు శిరీష్: ఒక్క...

హైదరాబాద్‌లోని వినోబా నగర్‌ హనుమాన్ ఆలయం...

పెద్దల సభకు రాజకీయ...

తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి...

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

పోల్స్