Saturday, October 3, 2026 06:04 PM
Saturday, October 3, 2026 06:04 PM

జగన్‌ చేతిలో 40 కోట్ల సుపారీ గుట్టు

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు వినియోగించిన రూ.40 కోట్ల సుపారీ మూలాలు ఎక్కడ ఉన్నాయో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్పష్టంగా తెలుసని, దీనిపై ఆయన వెంటనే నోరు విప్పాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, MLC వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఈ కేసులోని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వర్ల రామయ్య ప్రస్తావించారు.

Also Read : ఫ్లైదుబాయ్ ఉగ్ర కుట్రలో సంచలనం.. కో-పైలట్ పై నిషేధం.. అయినా జాబ్..?

వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు, సమాచారం కలిగిన సాక్షులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా అనుమానాస్పద రీతిలో మృతి చెందుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు వర్ల రామయ్య. గతంలో వైఎస్ జగన్‌ను హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకెళ్లిన డ్రైవర్ కూడా అనుమానాస్పద స్థితిలోనే ప్రాణాలు కోల్పోయాడని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు రావడం తీవ్ర సంచలనం రేపుతోందని, కేసు విచారణ కీలక దశకు చేరుకుందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని అన్నారు.

ఈ కేసులో చోటుచేసుకున్న వరుస అనుమానాస్పద మరణాలు, రూ.40 కోట్ల సుపారీ లావాదేవీల వెనుక ఉన్న అసలు హస్తం ఎవరిదో నిగ్గు తేల్చడానికి నిష్పాక్షిక విచారణ జరగాలని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు అందిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల మూలాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, బాబాయ్ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులు చట్టం ముందు నిలబడక తప్పదన్నారు.

Also Read : మద్యం స్కామ్‌లో మరో సంచలనం.. చిరుద్యోగుల జీతాలు కూడా వదల్లేదా..?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణంపైనా వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అక్రమ మద్యం వ్యవహారంలో ప్రధాన బాధ్యత, వేళ్లన్నీ నేరుగా వైఎస్ జగన్ వైపే చూపిస్తున్నాయని ఆరోపించారు. ఒకవైపు బాబాయ్ హత్య కేసులో ED దర్యాప్తు స్పీడందుకోవడం, మరోవైపు రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం బయటపడడంతో వైసీపీ అగ్రనేతల అసలు రూపం త్వరలోనే బట్టబయలవుతుందన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

నాడు ISB, నల్సార్.....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో...

రచ్చ చేస్తున్న ఫామ్‌హౌస్...

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఫామ్ హౌస్...

మద్యం స్కామ్‌లో మరో...

గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన...

ఈడీ స్పీడ్ ను...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి...

డిసెంబర్‌కు వాయిదా పడనున్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ,...

పోల్స్