Saturday, October 3, 2026 07:03 PM
Saturday, October 3, 2026 07:03 PM

ఫ్లైదుబాయ్ ఉగ్ర కుట్రలో సంచలనం.. కో-పైలట్ పై నిషేధం.. అయినా జాబ్..?

దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని ఆకాశంలోనే పేల్చేయడానికి, అలాగే భారత కెప్టెన్ స్మిత్ మఛ్ఛార్‌పై కత్తితో ప్రాణాంతక దాడికి ఒడిగట్టిన ఉన్మాద కో-పైలట్ హమామ్ అల్హమామి గురించిన భయంకరమైన నిజాలు అంతర్జాతీయ నిఘా సంస్థల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడైన ఈ ఒమన్ జాతీయుడిని అతని సొంత దేశమైన ఒమన్ ప్రభుత్వం గతంలోనే విమానాలు నడపకుండా నిషేధించిందని తాజాగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Also Read : ఫ్లైదుబాయ్ విమానం కూల్చే కుట్ర వెనుక ఇరాన్ హస్తం..?

తీవ్రవాద, జిహాదీ భావజాలానికి ప్రభావితుడయ్యాడనే బలమైన కారణాలతోనే అతనిపై ఈ నిషేధం విధించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిఘా వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం.. హమామ్ అల్హమామి ఒమన్ పౌరుడైనప్పటికీ, అతను తన జీవితంలో ఎక్కువ భాగం ఒమన్ వెలుపల, ముఖ్యంగా సిరియాలో గడిపాడు. అక్కడ ఉన్న సమయంలోనే అతను తీవ్రమైన ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలానికి బానిసైనట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత 2024లో ఒమన్ జాతీయ విమానయాన సంస్థ ఒమన్ ఎయిర్ లో కో-పైలట్ ట్రైనీగా ఉన్న సమయంలో, అతని వద్ద అపాయకరమైన ఉగ్రవాద సమాచారం, ప్రచార సామాగ్రి దొరకడంతో నిఘా సంస్థలు అతడిని సెక్యూరిటీ రిస్క్‌గా గుర్తించాయి. దాంతో ఒమన్ ఎయిర్ అతనికి శిక్షణను నిలిపివేసి, విమానాలు నడపకుండా పూర్తిగా నిషేధం విధించి, కేవలం ఆఫీసు పరిపాలనా పనులకే పరిమితం చేసింది. సొంత దేశంలో అంత పెద్ద సెక్యూరిటీ రిస్క్ అని తేలి, విమానాలు ఎగరవేయకుండా బ్యాన్ ఉన్నప్పటికీ.. దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ కేవలం ఎనిమిది నెలల క్రితమే అతడిని ఉద్యోగంలోకి ఎలా తీసుకుందనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది.

Also Read : అమలు లోకి కొత్త టోల్ రూల్స్.. వాళ్లకు ఫాస్ట్‌ట్యాగ్ ఉండదు..!

పైగా యూఏఈ – ఇజ్రాయెల్ లాంటి అత్యంత సున్నితమైన అంతర్జాతీయ విమాన రూట్లలో అతనికి ఎలా డ్యూటీ వేశారనే కోణంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మోసాద్, షిన్ బెట్, యూఏఈ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హమామ్ అల్హమామి సోషల్ మీడియా ఖాతాలలో ఉగ్రవాద చిత్రాలు, అతని సామాగ్రిలో తీవ్రమైన ప్రొ-పాలస్తీనియన్ సమాచారం లభ్యమవడంతో.. అతను ఇజ్రాయెల్ భూభాగంలోనే విమానాన్ని వందలాది మంది ప్రయాణికులతో సహా క్రాష్ చేయాలనే ఆత్మహుతి ప్లాన్‌తో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం సౌదీ అరేబియా నుంచి యూఏఈకి తరలించబడిన ఈ నిందితుడిపై అంతర్జాతీయ ఉగ్రవాద చట్టాల కింద విచారణ కొనసాగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

జగన్‌ చేతిలో 40...

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు...

నాడు ISB, నల్సార్.....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో...

రచ్చ చేస్తున్న ఫామ్‌హౌస్...

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఫామ్ హౌస్...

మద్యం స్కామ్‌లో మరో...

గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన...

ఈడీ స్పీడ్ ను...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి...

పోల్స్