దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల అథారిటీ సరికొత్త టోల్ నిబంధనలను తీసుకువచ్చింది, ఇవి నేటి నుంచే అధికారికంగా అమలుల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం, దివ్యాంగులు ప్రయాణించే వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభించనుంది.
Also Read :వారికి టికెట్లు లేవు.. పల్లా క్లారిటీ..!
దివ్యాంగుల రవాణాను మరింత సులభతరం చేయడానికి, వారికి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర రవాణా శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, అర్హులైన దివ్యాంగులు టోల్ మినహాయింపును పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎక్సెంప్టెడ్ ఫాస్ట్‌ట్యాగ్.. పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణ ఫాస్ట్‌ట్యాగ్‌ల లాగా కాకుండా, ఈ ప్రత్యేక టోల్ ఫ్రీ ట్యాగ్ ఉన్న వాహనాలు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల గుండా వెళ్ళినప్పుడు ఎలాంటి రుసుము కట్ అవ్వదు.
Also Read : తాడేపల్లి టు ఢిల్లీ వయా సీపీఐ.. కాంగ్రెస్ కోసమే..?
అయితే, ఈ మినహాయింపును పొందడానికి దివ్యాంగులు తమ వాహనాలను నిర్ణీత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన యుడీఐడీ కార్డ్ లేదా వైకల్య ధృవీకరణ పత్రం ఆధారంగా ఈ ఉచిత ఫాస్ట్‌ట్యాగ్‌ను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త విధానం పట్ల దివ్యాంగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో టోల్ ప్లాజాల వద్ద మినహాయింపుల కోసం గుర్తింపు కార్డులు చూపించి, సమయం వృథా కావడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఇప్పుడు ఈ ఎక్సెంప్టెడ్ ఫాస్ట్‌ట్యాగ్ విధానం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ పద్ధతిలోనే టోల్ గేట్ల వద్ద ఉచితంగా ప్రయాణించే వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

