Thursday, October 1, 2026 07:31 PM
Thursday, October 1, 2026 07:31 PM

తాడేపల్లి టు ఢిల్లీ వయా సీపీఐ.. కాంగ్రెస్ కోసమే..?

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ నుంచి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం తనను నమ్మకపోవడం, జాతీయ స్థాయిలో సానుకూల పవనాలు లేకపోవడం జగన్ కు ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో కేంద్రంలో, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, దర్యాప్తు సంస్థల వేగం పెరగడం వంటి పరిణామాలు జగన్‌ను సరికొత్త ఆలోచనల వైపు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదా వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగడం ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Also Read : ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు..!

రాజకీయ వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న లెఫ్ట్ పార్టీల నేతలను మధ్యవర్తులుగా వాడుకుంటూ, కాంగ్రెస్‌తో ఉన్న పాత విభేదాలను పక్కన పెట్టి ఒక ఉమ్మడి వేదికపైకి రావడానికి తెరవెనుక రాయబారాలు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్ ఈ తరహా నిర్ణయం వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం కేంద్రంలోని తాజా పరిస్థితులేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఉన్నట్లుగా కేంద్ర పెద్దల నుండి సానుకూలత లభించకపోవడం, మద్యం కుంభకోణం, వివేకా హత్య కేసు వంటి కీలక వ్యవహారాలు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ బిగుస్తుండటంతో జగన్‌కు రాజకీయ రక్షణ అత్యవసరంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య బంధం మరింత బలోపేతం అవుతుండటంతో.. భవిష్యత్తులో బీజేపీ తమకు అండగా నిలిచే అవకాశం లేదని జగన్ ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.. కేటీఆర్ క్లారిటీ..!

భవిష్యత్తులో కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారి, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జగన్ బలంగా నమ్ముతున్నట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అదే జరిగితే, కేంద్రంలో అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ కూటమికి ఇప్పుడే దగ్గరవ్వడం ద్వారా తనపై ఉన్న సిబిఐ, ఈడి కేసుల నుండి ఉపశమనం పొందవచ్చని, అలాగే రాష్ట్రంలో టీడీపీని అడ్డుకోవచ్చని జగన్ భావిస్తున్నారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత అన్నచెల్లెళ్ళ సవాల్‌గా మారిన ఏపీ రాజకీయం.. ఇప్పుడు విలీనం లేదా పొత్తుల వైపు మళ్లీ తిరిగితే రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కడం ఖాయం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

ఏపీ స్థానిక ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతోన్న స్థానిక సంస్థల...

పోల్స్