Saturday, November 14, 2026 03:57 PM
Saturday, November 14, 2026 03:57 PM

భారత్ లో పాక్ చిల్లర ఆపరేషన్.. ఆర్మీలో ఏం జరుగుతోంది..?

దేశ భద్రతకు అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచారి సంస్థకు చెందిన ఏజెంట్‌కు చేరవేసిన భారత వైమానిక దళ అధికారి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కేవలం అశ్లీల ఫొటోల ఆశకు లొంగిపోయిన సదరు వింగ్ కమాండర్, భారత వైమానిక దళానికి చెందిన అత్యంత రహస్య యుద్ధ ప్రణాళికలు, డ్రోన్ల సామర్థ్యం, సైనిక స్థావరాల వివరాలను పాక్ ఏజెంట్‌కు లీక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

Also Read : అసలు మైక్రోసాఫ్ట్ కు ఏమైంది..? ఎందుకింత లేట్..?

ఈ ఏడాది జనవరి 12 నుంచి ఏప్రిల్ 1 మధ్య కాలంలో నిందితుడైన అధికారి వాట్సాప్ ద్వారా పాక్ ఏజెంట్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, పాక్ ఏజెంట్ ఒక్కో అశ్లీల ఫొటో పంపినప్పుడల్లా, దానికి బదులుగా ఈ అధికారి భారత వైమానిక దళం యొక్క రహస్య యుద్ధ ప్రణాళిక పత్రాల్లోని ఒక్కో పేజీని ఫొటో తీసి పంపేవాడు. ఏప్రిల్ 1న తన కార్యాలయంలోకి నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్తుండగా అధికారులు తనిఖీ చేయడంతో ఈ కుట్ర బట్టబయలైంది.

అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, గత ఐదు నెలలుగా అతడిని కస్టడీలో ఉంచి విచారిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. నిందితుడు పాక్ ఏజెంట్‌కు చేరవేసిన సమాచారం దేశ భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేదిగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా భారత వైమానిక దళానికి చెందిన రహస్య డ్రోన్ యూనిట్ బలం, వాటి పరీక్షలు, పనితీరు, ఆయుధాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యంతో పాటు యుద్ధ సమయాల్లో వాటిని ఎక్కడ మోహరిస్తారనే కీలక వివరాలను లీక్ చేశాడు.

Also Read : డేంజర్ జోన్‌లో ఏపీ.. మళ్లీ హై అలర్ట్..!

అంతేకాకుండా, సరిహద్దు ప్రాంతమైన లేహ్‌లో ఫైటర్ జెట్ల మోహరింపు, రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగిన సైనిక విన్యాసాల సమాచారాన్ని కూడా శత్రుదేశానికి చేరవేశాడు. ఈ కేసులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, సదరు అధికారి తన కింద పనిచేస్తున్న మరో ఐదుగురు అధికారుల మొబైల్ ఫోన్లలోకి పాక్ ఏజెంట్ పంపిన మాల్‌వేర్, స్పైవేర్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయించాడు. తద్వారా ఆ అధికారుల ఫోన్లలోని రహస్య సమాచారాన్ని, ఉన్నతాధికారులతో వారు జరిపే సంభాషణలను పాక్ ఏజెంట్ నేరుగా దొంగిలించేందుకు సహకరించాడు. నిందితుడి ఫోన్ డేటాను పరిశీలించగా పాక్ ఏజెంట్‌తో 3,008 టెక్స్ట్ మెసేజ్‌లు, 65 ఫొటోలు, 42 వాయిస్ కాల్స్, 4 వీడియో కాల్స్ మాట్లాడినట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. ఈ కుట్రలో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సర్పంచ్.. ఒకటో సారి.....

అయ్య బాబోయ్.. అమ్మ భాబోయ్.. పంచాయతీ...

కూటమికి ఇబ్బందిగా మారిన...

అధికారం అండతో ప్రజాప్రతినిధులు నిబంధనలను తుంగలో...

డేంజర్ జోన్‌లో ఏపీ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్యాలు వరుసగా...

పంచాయతీ “రాజీ” కియాలు..!

రంగులు మారుతున్న పంచాయతీ "రాజీ" కియాలు.....

అసలు మైక్రోసాఫ్ట్ కు...

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో...

నా ఫోన్ లో...

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత...

పోల్స్