Saturday, November 14, 2026 11:33 AM
Saturday, November 14, 2026 11:33 AM

డేంజర్ జోన్‌లో ఏపీ.. మళ్లీ హై అలర్ట్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్యాలు వరుసగా వెంటాడుతున్నాయి. ఇప్పటికే అర్నబ్, మురుసు తుఫాన్ల దెబ్బకు అతలాకుతలమై కోలుకోలేకపోతున్న ఏపీకి వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరో పెను తుఫాన్ ముప్పు పొంచి ఉందని, ఏపీ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా బలపడుతూ మరో 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read : పంచాయతీ “రాజీ” కియాలు..!

ఎల్లుండి నాటికి ఇది పూర్తిస్థాయి వాయుగుండంగా రూపాంతరం చెంది, ఆ తర్వాత మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం బలపడుతూ వాయువ్య దిశగా ప్రయాణించి, ఈ నెల 19వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తీవ్ర తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చి, విశాఖపట్నం – మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read : నా ఫోన్ లో మోదీ చరిత్ర.. బాంబు పేల్చిన రాహుల్..!

గత తుఫాన్ల మిగిల్చిన నష్టాల నుంచి రైతులు, సామాన్య ప్రజలు ఇంకా తేరుకోకముందే మరో తీవ్ర తుఫాన్ ముంచుకొస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. తుఫాన్ గమనాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండగా, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓ వైపు కేంద్ర బృందాలు గత తుఫాన్ ల నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో, మరో తుఫాన్ రెడీగా ఉండటం గమనార్హం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పంచాయతీ “రాజీ” కియాలు..!

రంగులు మారుతున్న పంచాయతీ "రాజీ" కియాలు.....

అసలు మైక్రోసాఫ్ట్ కు...

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో...

నా ఫోన్ లో...

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత...

సీఐఐ సమ్మిట్‌లో లోకేష్,...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

గిరిజనుల అభిమానం పవన్...

గిరిజనులను ఆకట్టుకునేందుకు పవన్ కల్యాణ్ చేసిన...

‘ఇట్లు అర్జున’ రివ్యూ...

‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’...

పోల్స్