Sunday, November 15, 2026 06:33 PM
Sunday, November 15, 2026 06:33 PM

ఎల్‌నినో ముప్పు.. WHO హైరిస్క్ జాబితాలో భారత్

ఎల్‌నినో ప్రభావంతో ప్రజారోగ్య ముప్పు అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేర్చింది. తీవ్ర వేడి, వర్షపాతంలో మార్పులు, నీటి కొరత ప్రజారోగ్యంపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. భారత్‌లో డెంగీ, లెప్టోస్పైరోసిస్‌ ముప్పును ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మలేరియా ముప్పు కూడా ఉందని అంచనా వేసింది.

Also Read : సాక్షి ఛానల్ కు షాక్ ఇచ్చిన అమరావతి రైతు..!

గ్రేడ్‌-3 అంటే ఏమిటి?

ఎల్‌నినోతో తలెత్తే ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు WHO తన అత్యున్నత అత్యవసర స్పందన స్థాయి అయిన గ్రేడ్‌-3ను ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ స్థాయి కింద WHO ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, ఆయా దేశాల్లోని కార్యాలయాలు సమన్వయంతో పనిచేస్తాయి. నవంబర్‌ 2న విడుదల చేసిన కార్యాచరణ ప్రణాళిక 2026 అక్టోబర్‌ నుంచి 2027 సెప్టెంబర్‌ వరకు వర్తిస్తుంది.

2027లోనూ ఎల్‌నినో ప్రభావం

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సెప్టెంబర్‌ అంచనా ప్రకారం, 2027 ఫిబ్రవరి వరకు ఎల్‌నినో కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉంది. 2026 చివర్లో ఎల్‌నినో తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరవచ్చని, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై దాని ప్రభావం 2027లోనూ కనిపించవచ్చని తెలిపింది. ప్రాంతాన్ని బట్టి తీవ్ర వేడి, కరవు లేదా భారీ వర్షాల ముప్పు పెరగవచ్చని పేర్కొంది.

Also Read : కూటమికి ఇబ్బందిగా మారిన నెల్లిమర్ల మేడం..!

పంట దిగుబడులు, ఆహార లభ్యతపై ప్రభావం

వర్షపాతం తగ్గి పొడి పరిస్థితులు కొనసాగితే వర్షాధార పంటల దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. దాంతో రైతుల ఆదాయంతో పాటు ఆహార లభ్యతపైనా ప్రభావం పడవచ్చు. ఇప్పటికే ఆహార అభద్రత ఎదుర్కొంటున్న కుటుంబాల్లో పోషకాహార లోపం ముప్పు పెరగవచ్చని WHO హెచ్చరించింది.

వాతావరణ హెచ్చరికలను వ్యాధుల నిఘాతో అనుసంధానించాలని, తీవ్ర వేడి వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు ఆసుపత్రులను సిద్ధం చేయాలని WHO సూచించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అవసరమైన మందుల సరఫరా, అత్యవసర వైద్య సేవలు కొనసాగేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరింది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

దిల్ రాజు పై...

యశ్ నటించిన ‘టాక్సిక్’ తెలుగు విడుదల...

తారక్ టైమింగ్‌కు అనిల్...

‘ఇది ఖచ్చితంగా నవ్వుల జాతర కాబోతోంది’...

వెండితెర పై చెరగని...

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా...

సాక్షి ఛానల్ కు...

రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అసత్య...

జగన్ చెప్పినా వినను.....

ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో వ్యవహరించే...

సర్పంచ్.. ఒకటో సారి.....

అయ్య బాబోయ్.. అమ్మ భాబోయ్.. పంచాయతీ...

పోల్స్