Friday, August 14, 2026 06:09 AM
Friday, August 14, 2026 06:09 AM

సునీల్ కుమార్ కేసు.. రంగంలోకి ఏజీ..?

అధికారి పీవీ సునీల్ కుమార్ తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్.. సీఏటీలో దాఖలు చేసిన పిటిషన్ విచారణ రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్వయంగా వాదనలు వినిపించనున్నట్లు సమాచారం రావడంతో దీనిపై పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సాధారణంగా సర్వీస్ వివాదాల్లో ప్రభుత్వ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేదా ఇతర ప్రభుత్వ న్యాయవాదులు హాజరవడం ఆనవాయితీగా ఉంటుందని న్యాయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే ఈ కేసులో అడ్వకేట్ జనరల్ స్వయంగా రంగంలోకి దిగడం వెనుక ప్రత్యేక కారణాలేమిటన్న చర్చ మొదలైంది.

ఒక ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ వ్యవహారాన్ని ప్రభుత్వం అంత ప్రతిష్ఠాత్మకంగా ఎందుకు తీసుకుంటోందనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దళిత ఐపీఎస్ అధికారికి సంబంధించిన కేసు కావడం వల్ల ప్రభుత్వం ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా ఎదుర్కొంటోందా? లేక ఈ కేసు తీర్పు భవిష్యత్తులో ఇతర పరిపాలనా నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తోందా? అనే చర్చ కూడా సాగుతోంది.

Also read : అయోధ్య విరాళాల చోరీ కేసులో సంచలనం..!

ప్రతిపక్షాలు, దళిత సంఘాలు మాత్రం ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నాయి. గతంటే ఇలాంటి సర్వీస్ కేసుల్లో అడ్వకేట్ జనరల్ స్వయంగా వాదనలు వినిపించిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇందులో అసాధారణత ఏమీ లేదని, ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధమైనదనే విషయాన్ని బలంగా ట్రైబ్యునల్ ముందు వినిపించేందుకే అడ్వకేట్ జనరల్ హాజరవుతున్నారని చెబుతున్నాయి. సీఏటీలో జరిగే విచారణతో పాటు, అడ్వకేట్ జనరల్ వాదనలు ఈ కేసుకు ఎలాంటి మలుపు తీసుకొస్తాయన్నదానిపై రాష్ట్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతి సీడ్ యాక్సెస్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి రవాణా...

అమరావతికి రాచబాట.. సీడ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది....

కృష్ణా, గుంటూరు జిల్లాల...

కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని...

కర్నూలులో పొలిటికల్ హీట్.....

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం పరిసర...

గ్రూప్‌ 1 అక్రమాలు...

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌ వన్...

ఏపీలో కొత్త మద్యం...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీపై ఉత్కంఠ...

పోల్స్