Sunday, September 27, 2026 06:55 PM
Sunday, September 27, 2026 06:55 PM

అమరావతి సీడ్ యాక్సెస్ దుష్ప్రచారం.. అసలు నిజాలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఇ-3 సీడ్ యాక్సెస్ ప్రధాన రహదారి నిర్మాణంలో ఉన్న ‘S’ ఆకారపు మలుపుపై కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజధానిని ఇతర కీలక ప్రాంతాలతో అనుసంధానించే ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన రహదారిపై వస్తున్న తప్పుడు వార్తలను పురపాలక శాఖ తీవ్రంగా ఖండించింది. భవిష్యత్తు ప్రణాళికలు, అత్యాధునిక రవాణా అవసరాలకు అనుగుణంగానే ఈ రహదారి డిజైన్ రూపుదిద్దుకుందని, ఎలాంటి అపోహలకు గురికావద్దని ప్రజలకు స్పష్టం చేసింది.

Also Read : అమరావతికి రాచబాట.. సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఈ సీడ్ యాక్సెస్ రహదారిని కేవలం ప్రస్తుత అవసరాల కోసమే కాకుండా, రాబోయే రోజుల్లో పెరగబోయే ట్రాఫిక్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రహదారి మూడో దశ లో భాగంగా రానున్న విజయవాడ – చెన్నై జాతీయ రహదారి కనెక్టివిటీకి అనుగుణంగానే ఈ ‘S’ ఆకారపు మలుపును ఇంజనీరింగ్ ప్రమాణాలతో రూపొందించారు. నేషనల్ హైవే నెట్‌వర్క్‌తో ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా సులువుగా విలీనం అయ్యేందుకే ఈ విధమైన అమరిక అవసరమైందని, దీని వెనుక ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Also Read : కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు ఇండిగో గుడ్ న్యూస్..!

రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడ నగరాలతో రవాణా బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సీడ్ యాక్సెస్ రహదారితో పాటు బకింగ్‌హామ్ కెనాల్, కొండవీటివాగులపై భారీ స్టీల్ బ్రిడ్జిలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టులతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ ప్రాంతాలకు వెళ్లేవారి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. కరకట్ట రోడ్డుపై నిరంతరం ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులకు ఈ రహదారులు శాశ్వత పరిష్కారం చూపనున్నాయని, కాబట్టి అభివృద్ధిని అడ్డుకునేలా సాగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పురపాలక శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

పోల్స్