Sunday, October 4, 2026 10:02 AM
Sunday, October 4, 2026 10:02 AM

పవన్, లోకేష్ మధ్య గ్యాప్ ఉందా.. నిజమేనా..?

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ మధ్య గ్యాప్ ఉందంటూ ఇటీవల ఓ సర్వే సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. అటు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి కూడా. నారా లోకేశ్, పవన్ కల్యాణ్ మధ్య గ్యాప్ ఉందని జనసేన క్యాడర్ బలంగా నమ్ముతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఇద్దరూ పైకి బయటపడక పోయినా.. చంద్రబాబు తర్వాత స్థానం విషయంలో ఇద్దరి మధ్య కొంత విభేదాలు తలెత్తాయని జన సైనికులు నమ్ముతున్నారు. అయితే వాస్తవంలో మాత్రం నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ను అన్నా అని సంభోదించడం, అదే సమయంలో పవన్ కూడా లోకేష్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. నమ్ముతున్నారు.

Also Read : నాడు ISB, నల్సార్.. ఇప్పుడు ISA.. ఉన్నత విద్యారంగంలో చంద్రబాబు విజన్‌

నారా లోకేష్, పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు లేదా గ్యాప్ ఉందనే ప్రచారం మాత్రం బలంగా ఉంది. కానీ స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటు, భవిష్యత్తు రాజకీయాల నేపథ్యంలో క్యాడర్‌లో కొన్ని అంతర్గత చర్చలు, భయాలు, అనుమానాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. నారా లోకేష్ వివిధ సందర్భాల్లో పవన్ కల్యాణ్‌ను “పవనన్న” అని సంబోధిస్తూ తమ మధ్య కేవలం రాజకీయ బంధమే కాకుండా ఒక కుటుంబ బంధం కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో చిన్నపాటి విభేదాలు వచ్చినా కూర్చుని మాట్లాడుకుంటామన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ కొన్ని విషయాలపై లోకేష్‌తో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చినప్పుడు, ప్రజల ప్రయోజనాల కోసమే ఆ అభిప్రాయ భేదాలని, తమ మధ్య స్నేహం, గౌరవం ఎప్పటికీ బలంగానే ఉంటాయని లోకేష్ వివరణ ఇచ్చారు.

పవన్ కల్యాణ్‌పై లోకేశ్ నిఘా పెట్టారనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా వచ్చింది. అయితే అది కేవలం ఫేక్ న్యూస్ అని, కూటమిని దెబ్బతీసేందుకు ప్రత్యర్ధి పార్టీలు చేస్తున్న వ్యూహాత్మక ప్రచారమని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్స్ చెక్ ద్వారా స్పష్టం చేసింది. ఈ వివరణల తర్వాత క్యాడర్‌లో గందరగోళం చాలా వరకు తగ్గింది. అయినా క్షేత్ర స్థాయిలో టీడీపీ నేతల పెత్తనంతో మాత్రం జన సైనికులు ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని, అది ఎప్పుడైనా బద్దలవుతుందని విశ్వనిస్తున్నారని మరికొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

వైసీపీ సోషల్ మీడియా విభాగాలు కూటమిలో చిచ్చు పెట్టేందుకే ఈ “గ్యాప్” సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తున్నాయని జనసేన క్యాడర్ గట్టిగా నమ్ముతోంది. రాజమండ్రి జైలు ఘటన నుండి ఇప్పటి వరకు ఇద్దరు నేతలు ఎంతో సమన్వయంతో సాగుతున్నారని నేతలు గుర్తుచేస్తున్నారు. అదే విషయాన్ని కార్యకర్తలతో చెప్పి వారిని ఒప్పించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జన సైనికుల్లో మరింతగా ఈ విషయంపై ఆలోచింప చేస్తాయని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కింద స్థాయి క్యాడర్‌లో కొంత ఆందోళన ఉంది.

Also Read : రచ్చ చేస్తున్న ఫామ్‌హౌస్ పాలిటిక్స్..!

జనసేనకు తగినన్ని సీట్లు దక్కవనే సంకేతాలు వస్తే అది క్షేత్రస్థాయిలో అసంతృప్తికి దారితీస్తుందని, లేకుంటే మాత్రం లోకేష్ తన పంతాన్ని నెగ్గించుకున్నారని భావిస్తారని నేతలు భయపడుతున్నారు. జనసేన పార్టీ బలాన్ని తక్కువ చేసి చూడవద్దని స్థానిక నాయకులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. చివరగా, ఇద్దరు యువ నేతల మధ్య వ్యక్తిగత గ్యాప్ ఏమీ లేదని, కానీ భవిష్యత్తులో పార్టీల ఉనికి, స్థానిక ఎన్నికల సీట్ల పంపకాల విషయంలో క్లారిటీ వచ్చేంత వరకూ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని నాయకులు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

జగన్‌ చేతిలో 40...

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు...

నాడు ISB, నల్సార్.....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో...

రచ్చ చేస్తున్న ఫామ్‌హౌస్...

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఫామ్ హౌస్...

మద్యం స్కామ్‌లో మరో...

గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన...

ఈడీ స్పీడ్ ను...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి...

పోల్స్