Friday, August 14, 2026 08:49 AM
Friday, August 14, 2026 08:49 AM

కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్‌ లు..!

మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వేదికగా జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) హత్య కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి మే చివరి వారంలోనే ఈ దారుణానికి పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. టోల్ ప్లాజాల వద్ద, హైవే సిసిటివి కెమెరాల నిఘా కంటికి దొరక్కుండా ఉండేందుకు ప్రియుడు చేతన్ చౌదరి కార్‌ ను కాదని, ఒక స్కూటర్‌ పై పూణే నుంచి లోహగఢ్ కోటకు ప్రయాణించినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ స్కూటర్‌ ను పోలీసులు సీజ్ చేశారు.

Also Read : అమరావతిలో రౌడీ మూకలు.. సంచలన అరెస్ట్ లు..?

జూన్ 18న మధ్యాహ్నం హత్య జరగడానికి సరిగ్గా 34 నిమిషాల ముందు సియా, చేతన్‌ ల మధ్య ఒక సీక్రెట్ కాల్ నడిచినట్లు కాల్ డేటా రికార్డ్స్ ద్వారా స్పష్టమైంది. ఈ ఫోన్ కాల్‌ లోనే కోటలోని ఒక నిర్దిష్ట వ్యూ పాయింట్ వద్ద తాము ఉన్నామని, ప్రస్తుతానికి చుట్టుపక్కల టూరిస్టులు ఎవరూ లేరనే పక్కా సమాచారాన్ని చేతన్‌ కు సియా లీక్ చేసింది. అంతకంటే ముందే వారిద్దరూ ఈ కోటను సందర్శించి, ఎక్కడి నుంచి నెట్టేయాలో రెక్కీ నిర్వహించడమే కాకుండా దానికి రిహార్సల్ కూడా చేయడం చూసి అధికారులు కంగుతిన్నారు.

Also Read : స్టోక్స్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ నడిచిందా..?

కేతన్‌ ను లోయలోకి నెట్టేసే తరుణంలో ఒక ప్రత్యేక కోడ్‌ వర్డ్‌ ను ఈ కిల్లర్ జోడీ వాడుకుంది. అదే.. “బైఠ్నా”. ప్లాన్ ప్రకారం చేతన్ వెనుక నుంచి వస్తున్న సమయంలో.. సియా నీళ్లు తాగడానికో లేదా షూ లేస్ కట్టుకోవడానికో కేతన్ ముందు ఒక్కసారిగా కిందకు వంగి కూర్చోవాలి. అదే చేతన్‌ కు ఆఖరి సిగ్నల్. అంతేకాకుండా, లోయలోకి పడిపోయేటప్పుడు కేతన్ తనను కాపాడుకోవడానికి పొరపాటున కూడా సియాను పట్టుకోకుండా ఉండేందుకే ఆమె అలా కిందకు కూర్చునేలా ప్లాన్ చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతి సీడ్ యాక్సెస్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి రవాణా...

అమరావతికి రాచబాట.. సీడ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది....

కృష్ణా, గుంటూరు జిల్లాల...

కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని...

కర్నూలులో పొలిటికల్ హీట్.....

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం పరిసర...

గ్రూప్‌ 1 అక్రమాలు...

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌ వన్...

ఏపీలో కొత్త మద్యం...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీపై ఉత్కంఠ...

పోల్స్