Saturday, August 15, 2026 09:00 AM
Saturday, August 15, 2026 09:00 AM

జోగి సీటు చిరిగినట్లేనా.. గేట్ క్లోజ్..!

జోగి రమేష్.. ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. నోటితో అనరాని మాటలన్నీ అనేశాడు. అప్పటి మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించాడు. బహిరంగ సభలో, ప్రభుత్వ అధికారిక కార్యక్రమ వేదికపై కూడా ఓ మాజీ ముఖ్యమంత్రిని, ఓ పార్టీ అధినేతను బూతులతో రెచ్చిపోయాడు. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం నానా పాట్లు పడ్డాడు. చంద్రబాబు పైన, పవన్ కల్యాణ్ పైన, నారా లోకేష్ పైన, తెలుగుదేశం పార్టీ నేతలపైన నోటితో రెచ్చిపోయాడు. జోగి బూతులు మెచ్చిన జగన్.. మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు జోగి.

Also Read : గౌతమ్ గంభీర్ కోచ్ పదవి సేఫేనా..?

కోతికి కొబ్బరి చిప్ప చిక్కినట్లుగా జోగి రమేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో.. జోగి దూకుడుకు బ్రేకులు లేకుండా పోయాయి. అగ్రిగోల్డ్ బూతుల అక్రమ రిజిస్ట్రేషన్ మొదలు, చీప్ లిక్కర్ తయారీ, నకిలీ మద్యం సరఫరా, సెటిల్‌మెంట్లు, దందాలు.. ఇలా ఒకటేమిటి.. లెక్కలేనన్ని జోగి ఖాతాలో చేరాయి. ఎన్నికల సమయంలో కూడా టీడీపీ నేతలపై జోగి అదే తరహా దూకుడు ప్రదర్శించాడు. మేము గెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అని బెదిరించాడు. ఇక వైసీపీ ఓడిన తర్వాత కూడా.. మళ్లీ జగన్ సీఎం అవుతాడు.. అప్పుడు మీకు ఉంటుంది చూడు.. అంటూ ఇప్పటికీ బెదిరిస్తున్నాడంటే.. జోగి రమేష్ వ్యవహారం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. అలాగే నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ అరెస్టు అయ్యాడు. తాజాగా జోగి కుటుంబంపై ఆయన పెద్ద కోడలు మేఘన వరకట్న వేధింపుల కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా పెట్టింది. ఈ కేసు ఇప్పుడు కోర్టులో విచారణ దశలో ఉంది. దీంతో జోగి రమేష్ పరువు ఇప్పుడు పూర్తిగా పోయినట్లు అయ్యింది. జోగి రమేష్ వ్యవహార శైలిపై ఇప్పటికే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జోగి వల్ల వైసీపీకి పావలా ఉపయోగం లేదని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Also Read : మళ్లీ కొత్త పాట పాడుతున్న పేర్ని..!

జోగి రమేష్‌ను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూడాలని.. పార్టీ నేతలు ఎవరూ జోగితో మంతనాలు జరపవద్దని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి జోగి రమేష్ పేరు వైసీపీలో వినిపించకూడదని.. అందుకు ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ లీడర్లను తయారు చేయాలని జగన్ సూచించినట్లు సమాచారం. అటు పెడన, ఇటు మైలవరం నియోజకవర్గంలో జోగి పేరును వైసీపీ నేతలు ప్రస్తావించకూడదని.. జోగిని పార్టీకి దూరంగా ఉంచాలని ఇటీవల జగన్ ఆదేశించారంట. జోగి మీద ఉన్న ఫిర్యాదుల జాబితా చూసిన జగన్.. ఒక దశలో బాబోయ్ అన్నారట. జోగితో వైసీపీ నేతలు ఎంత దూరంగా ఉంటే.. అంత మంచిదని జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు సమాచారం. అందుకే ఇటీవల అధినేత జగన్‌ను కలిసేందుకు వచ్చిన జోగిని ఆఫీస్ బయటే నో ఎంట్రీ అని చెప్పేశారట. అప్పటి నుంచి జోగి కూడా రాజకీయాల గురించి మాట్లాడటం లేదని.. అసలు బయటే కనిపించటం లేదంటున్నారు సన్నిహితులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ కొత్త పాట...

ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.....

ఏపీలో మద్యం ధరలు...

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రిటైల్ ఎక్సైజ్ విధానం...

ఎన్టీఆర్ అభిమాని కొడుక్కి...

తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ భక్తి...

బ్రేకింగ్ : అమరావతిపై...

రాజధాని అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్...

గ్లోబల్ స్టేజీపై అమరావతి...

భారతదేశ అర్బన్ ప్లానింగ్ చరిత్రలోనే అత్యంత...

అమరావతి అసెంబ్లీలో స్వాతంత్ర్య...

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలందరినీ...

పోల్స్